కరవాలంతో బర్త్‌డే కేకు కోసాడు… కటకటాల వెనక్కి వెళ్లాడు

మెదడును పురుగు తొలిస్తే ఇదిగో నిఖిల్‌ పటేల్‌కు పుట్టినట్టే పిదప బుద్ధులు పుట్టుకొస్తాయి.. ఇంతకీ అతగాడు ఏం చేశాడంటే బర్త్‌ డే కేకును వెరైటీగా ఖడ్గంతో కట్‌ చేశాడు.. పాపం అతడేమో క్రియేటివిటిగా ఆలోచించాడు..

  • Balu
  • Publish Date - 2:24 pm, Fri, 23 October 20

మెదడును పురుగు తొలిస్తే ఇదిగో నిఖిల్‌ పటేల్‌కు పుట్టినట్టే పిదప బుద్ధులు పుట్టుకొస్తాయి.. ఇంతకీ అతగాడు ఏం చేశాడంటే బర్త్‌ డే కేకును వెరైటీగా ఖడ్గంతో కట్‌ చేశాడు.. పాపం అతడేమో క్రియేటివిటిగా ఆలోచించాడు.. పోలీసులు అలా కాదుగా! ఠాట్‌… బర్త్‌డే కేకును కూరగాయాలు కోసుకునే కత్తితోనో.. ప్లాస్టిక్‌ చాకుతోనే కట్‌ చేయాలి కానీ.. ఇలా పెద్ద కరవాలంతో కోస్తావా అంటూ కటకటాల వెనక్కు నెట్టారు.. అసలేం జరిగిందంటే మొన్న నిఖిల్ పటేల్‌ బర్త్‌డే జరిగింది.. అతడి ఫ్రెండ్స్‌ సెలెబ్రేషన్స్‌ కోసం ఓ పెద్దసైజున్న నాలుగు కేకులు తెచ్చారు.. ఫ్రెండ్స్‌ తెచ్చిన కేకులు చూసి నిఖిల్‌ మురిసిపోయాడు.. వెంటనే ఓ పెద్ద ఖడ్గంతో వాటిని కట్‌ చేశాడు.. చేస్తే చేశాడు కానీ ఆ దృశ్యాలన్నీ సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశాడు.. ఇంకేముంది .. అవి కాస్త వైరల్‌ అయ్యాయి.. వెంటనే పోలీసులు ఎంటరయ్యి నిఖిల్‌పై కేసు పెట్టారు.. నిఖిల్‌ దగ్గర నుంచి ఆ ఖడ్గాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.. పుట్టిన రోజు వేడుకలు ఇలా అవుతాయని నిఖిల్‌ ఊహించి ఉండడు..!!