Breaking News
  • అమరావతి: పాదయాత్రలో రైతులకు ఇచ్చిన మరో హామీ నేడు శ్రీకారం . నేటి నుండి 'వైయస్‌ఆర్‌ జలకళ' పథకం ప్రారంభం .క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించనున్న సీఎం వైయస్‌ జగన్ .రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు లబ్ది .వైయస్‌ఆర్‌ జలకళ కోసం రూ.2,340 కోట్లు కేటాయింపు .5 లక్షల ఎకరాలకు ఉచిత బోర్ల ద్వారా అందనున్న సాగునీరు .దరఖాస్తు నుంచి బోర్‌ డ్రిల్లింగ్ వరకు ఎప్పటికప్పుడు రైతుకు సమాచారం . శాస్త్రీయంగా భూగర్భజలాల లభ్యతపై అంచనా.
  • కృష్ణాజిల్లా : 29 మంది క్రికెట్ బుకీల అరెస్టు. విస్సన్నపేట మండలం కొర్ర తండా లో క్రికెట్ బుకీల పై పోలీసులు దాడులు. 29 మందిని అదుపులోకి తీసుకొని ఒక టీవీ సెల్ఫోన్లు .2000/-రూ..స్వాధీనం చేసుకున్న పోలీసులు. క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రౌడీషీట్లు తెరుస్తామంటున్న Si లక్ష్మణ్.
  • చెన్నై : చెన్నై విమానాశ్రయం లో భారీగా పట్టుబడ్డ బంగారం . దుబాయ్ నుండి చెన్నై కి అక్రమంగా బంగారం తరలుస్తునట్టు గుర్తింపు. పట్టుబడ్డ 1.62 కేజిల బంగారం విలువ 83 లక్షలు. బంగారాన్ని నల్లటి రాళ్ల రూపంలో అక్రమంగా తరలిస్తున్న ముఠా. ముగ్గురుని అరెస్ట్ చేసి విచారణ చేప్పట్టిన కస్టమ్స్ అధికారులు .
  • చెన్నై: ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్ కామెంట్స్ . నాన్నగారు లేరన్న విషయం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాము . ఇది మాట్లాడాల్సిన సమయం కాదు అయినా సరే చెప్పాల్సిన అవసరం వచ్చింది . నాన్నగారి ట్రీట్మెంట్ కి సంబంధించి బిల్లుల విస్షయంలొ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు . ఆగస్ట్ ఐదు నుంచి సెప్టెంబర్ 24 వరకూ ఆసుపత్రిలో చికిత్స పొందారు . ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్సకు సంబందించి భారీగా బిల్లు వేస్తె మేము చెల్లించలేకపోయామంటూ ప్రచారం చేస్తున్నారు . ఆసుపత్రి బిల్లు విషయంలో తమిళనాడు ప్రభుత్వం స్పందించలేదని రూమర్లు స్రుష్టించారు . పెండింగ్ బిల్లు కట్టలేదని ఎంజీఎం ఆసుపత్రి యాజమాన్యం నాన్నగారి పార్దివ దేహాన్ని అప్పగించలేదంటూ ప్రచారం చేస్తున్నారు . ఒక దశలో బిల్లుల విషయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జోక్యం చేసుకున్నారని కూడా ప్రచారం చేస్తున్నారు . ఇందులో ఏదీ వాస్తవం లేదు .. అంతా తప్పుడు ప్రచారమే . అసలు ఎంత బిల్లు అయిందో ఎవరికీ తెలీకుండానే మా మీద హాస్పిటల్ మీద ప్రచారం చేస్తున్నారు . అపోలో యాజమాన్యం కూడా నాన్నగారి ట్రీట్మెంట్ కి కావాల్సిన వైద్య పరికరాలను ఎంజీఎం ఆసుపత్రికి పంపింది.
  • వివాదాస్పద 3 రైతు బిల్లలకు రాష్ట్రపతి ఆమోదముద్ర. గెజిట్ నోటిఫికేషన్ విడుదల. నేటి నుంచి చట్టరూపం సంతరించుకున్న బిల్లులు.
  • తూర్పు బీహార్‌ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం. ఈశాన్య జార్ఖండ్‌, ఒడిశా మీదుగా మరో ఉపరితల ద్రోణి. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు. పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు. నేడు, రేపు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు-వాతావరణశాఖ.
  • నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అప్పటి వరకు కళ్ల ముందు ఆడుకుంటున్న చిన్నారి క్షణాల్లో విగతజీవిగా మారింది. యువకుడి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలోని శివం అపార్ట్‌మెంట్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది

ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసై‌.. ఆత్మహత్యకు పాల్పడుతున్న యువత

ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ కల్చర్‌ పెరిగిపోతుంది. వాటికి బానిసలుగా మారుతోన్న కొందరు భారీగా డబ్బులు పోగొట్టుకుంటూ, బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

Online Gambling Game, ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసై‌.. ఆత్మహత్యకు పాల్పడుతున్న యువత

Online Gambling Game: ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ కల్చర్‌ పెరిగిపోతుంది. వాటికి బానిసలుగా మారుతోన్న కొందరు భారీగా డబ్బులు పోగొట్టుకుంటూ, బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల జగిత్యాలలో ఆన్‌లైన్‌ గేమింగ్ సైట్‌ ద్వారా 7 లక్షలు పోగొట్టుకున్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా హైదరాబాద్‌ అమీర్‌పేట్‌లో అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది.

కర్నూల్‌కి చెందిన ఓ యువకుడు ఆన్‌లైన్‌ గేమింగ్‌కి అలవాటు పడి 6 లక్షలు పోగొట్టుకున్నాడు. ఎంబీఏ పూర్తి చేసి ఆన్‌లైన్‌ ఎక్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఆ యువకుడు..స్నేహితుల దగ్గర అప్పుల పాలు అవ్వడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాగా తెలంగాణలో గ్యాంబ్లింగ్‌ యాక్ట్‌ అమలులో ఉంది. ఈ క్రమంలో తెలంగాణలో డబ్బు చెల్లించి ఆడే ఆన్‌లైన్‌ గేమ్స్ నిషేధం. దీన్ని క్యాష్ చేసుకుంటున్న కొంత మంది పంటర్లు.. బాధితుడిని నుండి డబ్బు తీసుకుని హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో డబ్బు పెట్టిన యువత భారీగా నష్టపోతున్నారు. తిరిగి అప్పులు చెల్లించలేక ఆత్మ హత్యలకు పాలపడుతున్నారు.

Read This Story Also: ప్రాంతాల అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక అడుగు

Related Tags