Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

ఒక్క సెల్పీతో బీపీ చెకప్..?

BP Checkup With Selfiee, ఒక్క సెల్పీతో బీపీ చెకప్..?

మీరు రక్తపోటుతో బాధపడుతున్నారా..? బీపీ చెకప్ కోసం నెల నెల ఆస్పత్రి వరకూ వెళ్లి మీ బీపీ హెచ్చుతగ్గులు తెలుసుకుంటున్నారా..? అయితే, మీకు ఓ గుడ్ న్యూస్. ఇప్పుడు మీ బీపీని చెక్ చేసుకోవడానికి సులువైన మార్గం దొరికింది. మీ చేతిలో మొబైల్ ఫోన్లో సెల్ఫీ తీసుకున్నంత ఈజీగా బీపీని చెక్ చేసుకునే అవకాశం వచ్చింది. టొరంటో యూనివర్సిటీ శాస్త్రవేత్త కాంగ్ లీ సరికొత్తగా  వీడియో సెల్ఫీ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు.

ఇందులో చర్మం లోపలి చిత్రాలు తీయగల సాఫ్ట్ వేర్ తో తాము ముందుగా  కొంతమంది ముఖాల వీడియోలు తీశామని..రెండు నిమిషాల ఈ వీడియోల ద్వారా సేకరించిన బీపీ వివరాలకు బీపీ మెషిన్ ద్వారా సేకరించిన వివరాలను సరిపోల్చి ఈ సాఫ్ట్ వేర ను సిద్ధం చేశామని తెలిపారు. మెషిన్ లెర్నింగ్ పద్దతులను వాడటం ద్వారా ఈ సాఫ్ట్ వేర్ మన ముఖంలోని రక్తప్రసరణలో వచ్చే మార్పులను గుర్తించి దాని ఆధారంగా బీపీని లెక్కకట్టగలదు. ఈ పద్ధతి ద్వారా వచ్చే వివరాలు 95 శాతం ఖచితత్వంతో ఉన్నట్లు తమ అధ్యయనాల్లో తెలిసిందని కాంగ్ లీ వెల్లడించారు. మరికొన్ని పరిశోధనలు జరిపి త్వరలో అర నిమిషం వీడియో సెల్ఫీతో బీపీ చెక్ చేసే సాంకేతికతను అందుబాటులోకి తీసుకువస్తామని కాంగ్ లీ స్పష్టం చేశారు.