‘ఇస్మార్ట్ శంకర్’ కథ నాదే… రైటర్ ఫిర్యాదు!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి, ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నెల 18న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే ఊపందుకున్నాయి. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో రామ్ పూర్తి మాస్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాపై వివాదం ముసురుకోవడం ఇప్పుడు సంచలనమైంది. ట్రైలర్ చూసినందరూ ఈ సినిమా కూడా కాపీనే అని విమర్శిస్తున్నారు.

2016లో విడుదలైన హాలీవుడ్ చిత్రం ‘క్రిమినల్’కు.. ఈ సినిమా కథకు పోలికలు ఉన్నాయని పలువురు క్రిటిక్స్ విమర్శలు గుప్పించారు. `క్రిమినల్` కథాంశం ప్రకారం.. ఓ హ్యాకర్ ని సీఐఏ ఏజెంట్ వెంటాడుతాడు. కానీ ఆ ఏజెంట్ హత్యకు గురవుతాడు. ఆ క్రమంలోనే అతడి బ్రెయిన్ లోని మెమరీస్‌ని చిప్ ద్వారా కాజేసి సదరు క్రిమినల్ బ్రెయిన్‌లోకి పంపిస్తారు. సరిగ్గా ఇలాంటి కథ తరహాలోనే ‘ఇస్మార్ట్ శంకర్’ కథ కూడా ఉందని ట్రైలర్ చూసిన క్రిటిక్స్ ఆరోపణ. ఈ స్టోరీని పూరి హాలీవుడ్ నుంచి ఫ్రీమేక్ చేశారని చర్చ జరుగుతోంది.

మరోవైపు ఈ కథ నాదేనంటూ ఓ యువ రైటర్ రచయితల సంఘంలో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ‘ఇస్మార్ట్ శంకర్’ కథను నిర్మాత స్రవంతి రవికిషోర్‌కు గతంలో చెప్పానని.. ఆ కథనే పూరి యధాతధంగా తెరకెక్కించాడని సదరు రచయిత తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరి ఈ తతంగంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *