పెళ్లికి నిరాకరించాడని.. ఫ్లైఓవర్‌పై నుంచి దూకి యువతి ఆత్మహత్య

ప్రేమించిన వ్యక్తి పెళ్లి నిర్లక్ష్యం చేస్తున్నాడని భావించిన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. అర్థరాత్రి ప్రియుడి కళ్ల ముందే ఫ్లైఓవర్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

పెళ్లికి నిరాకరించాడని.. ఫ్లైఓవర్‌పై నుంచి దూకి యువతి ఆత్మహత్య
Follow us

|

Updated on: Sep 25, 2020 | 11:49 AM

ప్రేమించిన వ్యక్తి పెళ్లి నిర్లక్ష్యం చేస్తున్నాడని భావించిన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. అర్థరాత్రి ప్రియుడి కళ్ల ముందే ఫ్లైఓవర్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సికింద్రాబాద్ లో చోటు చేసుకుంది. సికింద్రాబాద్ లోని సీతాఫల్‌మండీ జోషి కంపౌండ్‌ ప్రాంతానికి చెందిన పాండుకు నలుగురు కుమార్తెలు. రెండవ కుమార్తె పూజిత (19) ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటుంది. అదే ప్రాంతానికి చెందిన ప్రదీప్‌తో పరిచయం ఏర్పడి… అదికాస్తా ప్రేమగా మారింది.. మూడేళ్లుగా ఇరువురు ప్రేమించుకుంటున్నారు.పెళ్లి చేసుకోమని పూజిత తరుచు ఒత్తిడి తెస్తుండటంతో ప్రదీప్ కాలయాపన చేస్తూ వస్తున్నాడు. ఇదే క్రమంలో ఎలాగైనా పెళ్లికి ఒప్పించాలనుకుంది పూజిత. దీంతో బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో సీతాఫల్‌మండీ ఫ్లైఓవర్‌ పైకి రావాలని చెప్పడంతో ప్రదీప్‌ మరో మిత్రునితో కలిసి వచ్చాడు. పూజిత, ప్రదీప్‌లు కొంతసేపు మాట్లాడుకున్నారు.పెళ్లి ప్రస్తావన రావడంతో కొద్ది సేపు ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. మరి మరికొన్నాళ్లు ఆగితే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో క్షణికావేశానికిలోనైన పూజిత పరిగెత్తుకుంటూ కొంతదూరం వెళ్లి ఫ్లైఓవర్‌ పైనుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. హఠాత్తు పరిణామంతో ప్రదీప్, అతని స్నేహితుడు అక్కడి నుంచి పారిపోయారు.

బుధవారం రాత్రి 11 గంటల సమయంలో పెద్దశబ్ధం రావడంతో సీతాఫల్ మండీ ఫ్లైఓవర్ ప్రాంతంలో కొంత అలజడి మొదలైంది. స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి చూడగా ఫ్లైఓవర్‌ కింద రక్తపు మడుగులో పడి ఉన్న యువతి కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పూజితను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటికే పూజిత మరణించింది. పూజిత తండ్రి పాండు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, ఉస్మానియా మార్చురీలో గురువారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపారు. పూజిత మృతికి కారణమైన ప్రదీప్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..