కీర్తి కేసులో ఊహించని మరో ట్విస్ట్.. తనే చంపేసి.. తండ్రిపైనే ఫిర్యాదు..!

ప్రేమ మాయ.. ఏదీ కనబడనీయదు. ఆ ప్రేమ కోసం కన్న తల్లినే కడతేర్చింది ఓ కిరాతకురాలు. ప్రేమ వల్ల భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని తల్లి చెప్పిన మాటలు ఆమెకు కర్ణకఠోరంగా వినిపించాయి. తన సంతోషానికి అడ్డొస్తుందని.. ప్రియుడుతో కలిసి కన్న తల్లిని చంపేసింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రామన్నపేటకు చెందిన శ్రీనివాస్ రెడ్డి, అతని భార్య రజితకు కీర్తి అనే కూతురు ఉంది. బతుకుదెరువు కోసం.. హైదరాబాద్‌ శివారులోని మునగనూర్‌ […]

కీర్తి కేసులో ఊహించని మరో ట్విస్ట్.. తనే చంపేసి.. తండ్రిపైనే ఫిర్యాదు..!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 28, 2019 | 6:32 PM

ప్రేమ మాయ.. ఏదీ కనబడనీయదు. ఆ ప్రేమ కోసం కన్న తల్లినే కడతేర్చింది ఓ కిరాతకురాలు. ప్రేమ వల్ల భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని తల్లి చెప్పిన మాటలు ఆమెకు కర్ణకఠోరంగా వినిపించాయి. తన సంతోషానికి అడ్డొస్తుందని.. ప్రియుడుతో కలిసి కన్న తల్లిని చంపేసింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. రామన్నపేటకు చెందిన శ్రీనివాస్ రెడ్డి, అతని భార్య రజితకు కీర్తి అనే కూతురు ఉంది. బతుకుదెరువు కోసం.. హైదరాబాద్‌ శివారులోని మునగనూర్‌ గ్రామంలో నివసిస్తున్నారు. శ్రీనివాస రెడ్డి డ్రైవర్. కొన్ని రోజులు బయట పనులకు వెళ్లి వస్తూంటాడు. ఇంట్లో.. రజిత, కూతురు కీర్తీ ఉంటారు. యుక్త వయసులో ఉన్న కీర్తి.. చదువుతో పాటు.. స్థానికంగా ఉండే ఇద్దరు యువకులతో ప్రేమ వ్యవహారం నడిపిస్తోంది. ఒకరికి తెలియకుండా మరొకరితో చాటింగ్‌లు, సినిమాలకు వెళ్లడం చేస్తోంది. ఇది గమనించిన తల్లి రజిత.. కూతురిని మందలించింది.

దీంతో.. అక్కసు పెంచుకున్న కూతురు.. తండ్రి ఇంట్లో లేని సమయం చూసి.. ఈ నెల 19వ తేదీన తల్లిని ప్రియుడితో కలిసి చంపేసింది. అంతేకాకుండా.. ఆ ఇంట్లోనే.. మూడు రోజులు.. ప్రియుడుతో కలిసి ఉంది. తల్లి మృతదేహం వాసన రావడంతో.. 21వ తేదీన రామన్న పేటకు పక్కనే ఉన్న రైల్వే ట్రాక్‌ పక్కన పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించింది.

మరో ట్విస్ట్:

డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన శ్రీనివాస్‌రెడ్డికి.. భార్య రజితతో పాటు కూతురు కీర్తీ కనిపించలేదు. అయితే.. కాసేపటికి ఇంటికి వచ్చిన కీర్తిని ఎక్కడికి వెళ్లావని అడిగితే.. వైజాగ్ వెళ్లానని చెప్పింది. అమ్మ ఏదని అడుగగా.. నాకు తెలీదని చెప్పింది. కీర్తి చెప్తున్న మాటల్లో పొంతన లేకపోవడంతో.. అనుమానం వచ్చి ఎవరితో వెళ్లావని నిలదీయగా.. తడబడింది. కానీ.. బంధువులందరం.. కలిసి గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటకు వచ్చిందని.. శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వివరించాడు.

అంతేకాకుండా.. మళ్లీ.. తిరిగి పోలీసులకు నాపైనే ఫిర్యాదు చేసిందని.. నేను తాగి వచ్చి రజితను వేధిండంతోనే.. ఇంటి నుంచి పారిపోయినట్టు.. పోలీసులకు చెప్పినట్లు.. శ్రీనివాస్ రెడ్డి మీడియాకు చెప్పాడు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు.. తమదైన స్టైల్లో కీర్తిని విచారించగా.. చంటి అలియాస్ శశితో కలిసి రజితను చంపినట్టు ఒప్పుకుంది. చంటి కాళ్లు పట్టుకోగా.. తానే.. రజితను చున్నీతో ఉరివేసి చంపిందని చెప్పింది కీర్తి. దీంతో.. తండ్రి శ్రీనివాస్ రెడ్డి సహా.. బంధువులందరూ.. షాక్ తిన్నారు.