ఫొటోకి లైకులు రావడం లేదని యువతి సూసైడ్

ప్రస్తుతం యువత ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి వాటిల్లో ఛాటింగులతో బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా కాలం గడిపేస్తున్నారు. ఇక సెల్ఫీలు, ఆన్‌లైన్ గేమ్స్ అంటూ నిండు జీవితాల్ని కోల్పోతున్నారు. అతిగా సోషల్ మీడియా వినియోగిస్తే..

ఫొటోకి లైకులు రావడం లేదని యువతి సూసైడ్
Follow us

| Edited By: Team Veegam

Updated on: Sep 15, 2020 | 7:02 PM

ప్రస్తుతం యువత ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి వాటిల్లో ఛాటింగులతో బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా కాలం గడిపేస్తున్నారు. ఇక సెల్ఫీలు, ఆన్‌లైన్ గేమ్స్ అంటూ నిండు జీవితాల్ని కోల్పోతున్నారు. అతిగా సోషల్ మీడియా వినియోగిస్తే మానసికంగా అనేక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నా బేఖాతర్ చేసి ప్రాణాలను విడుస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఇంగ్లాండులో జరిగింది. ఫొటోకి సరిగా లైకులు రావడం లేదని ఓ యువతి సూసైడ్ చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఫేస్ బుక్ వాడకాన్ని వ్యసనంగా మార్చుకున్న క్లోయే అనే 19 ఏళ్ల ఇంగ్లాండ్ యువతి లాంచెస్టర్‌లో ఆత్మహత్య చేసుకుంది. అయితే మొదట ఆమెను ఎవరో హత్య చేశారనుకున్నా.. ఆమె స్నేహితురాలు అసలు నిజాన్ని బయటపెడ్డటంతో అందరూ షాక్ అయ్యారు. క్లోయే ఫొటోలు తీసుకుని వాటిని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసేదని.. అయితే ఆ ఫొటోలకు ఎవరూ లైకులు కొట్టకపోవడంతో డిప్రెషన్‌కు గురై సూసైడ్ చేసుకుందని తెలిపింది. ఇదివరకే దీనికి గురించి తనతో పలు మార్లు చెప్పిందని క్లోయే స్నేహితురాలు చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న క్లోయె తల్లి తీవ్ర ఆవేదన చెందుతోంది.

Read More:

ఇంకా కోమాలోనే ప్రణబ్ ముఖర్జీ.. మారని పరిస్థితి

బ్రేకింగ్: సినిమా షూటింగులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్