Breaking News
  • తెలంగాణలో వర్షాలను కేంద్రం గమనిస్తోంది. ఇళ్లు, పంటలు వరద ముంపునకు గురయ్యాయి. వరద నష్టం అంచనా వేసేందుకు.. రేపటి నుంచి తెలంగాణలో కేంద్ర బృందం పర్యటిస్తుంది. ప్రవీణ్‌ వశిష్ట నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం. కేంద్ర బృందంలో జలశక్తి శాఖ ఉన్నతాధికారులు. వరద బాధితులకు కేంద్ర సాయం అందుతుంది. వైపరీత్యాల వల్ల చనిపోయినవారికి.. రూ.4 లక్షలు పరిహారం ఇవ్వాలని మోదీ గతంలోనే నిర్ణయించారు. కేంద్ర సాయం అందేలోపు ఎస్డీఆర్‌ఎఫ్‌ నుంచి ఖర్చు చేయాలి. తర్వాత కేంద్రం రీఎంబర్స్‌మెంట్‌ చేస్తుంది-కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి.
  • అమరావతి: ఉపాధి హామీ కూలీలపై మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం, ఉపాధి కూలీలకు మంత్రి ధర్మాన క్షమాపణ చెప్పాలి-టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌.
  • భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశం. కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి. నగరంలోని చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు పడ్డాయి. మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశముంది. లోతట్టు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-సీఎం కేసీఆర్‌.
  • హైదరాబాద్‌: వీడిన కూకట్‌పల్లి కిడ్నాప్‌ మిస్టరీ. 24 గంటల్లో కిడ్నాప్‌ కేసు ఛేదించిన పోలీసులు. రహీంను ఆటోలో కిడ్నాప్‌ చేసిన ఇద్దరు దుండగులు. రహీంను పఠాన్‌చెరు తీసుకెళ్లిన కిడ్నాపర్లు. తల్లి రేష్మకు ఫోన్‌ చేసి రూ.మూడు లక్షలు డిమాండ్‌. భయంతో రూ.10 వేలు ట్రాన్సఫర్‌ చేసిన తల్లి. మొబైల్‌ లొకేషన్‌ ఆధారంగా కిడ్నాపర్ల గుర్తింపు. ప్రధాన నిందితుడు సలీంను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పరారీలో మరో నిందితుడు లక్కీ. లక్కీ కోసం గాలిస్తున్న పోలీసులు.
  • విజయవాడ: ఇంద్రకీలాద్రికి పొంచి ఉన్న ముప్పు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని సమాచారం. భారీ వర్షాలకు 4 అంగుళాలు బీటలు వారిన కొండ. అప్రమత్తమైన ఇంజినీరింగ్‌ అధికారులు. ఈవో సురేష్‌బాబుకు సమాచారమిచ్చిన అధికారులు.
  • నేటి నుంచి ఈ నెల 31 వరకు కోవిడ్‌ అవగాహన కార్యక్రమాలు. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌తో నేడు అవగాహన ర్యాలీ. రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు తగ్గడం సంతోషించదగ్గ విషయం. ప్రతి ఒక్కరూ భౌతిక దరం పాటించాలి, మాస్క్‌ ధరించాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని.
  • దివాకర్‌ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్. కర్నాటక లోకాయుక్తను ఆశ్రయించిన తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి. దివాకర్‌ ట్రావెల్స్‌ అక్రమాలపై ఫిర్యాదు. బీఎస్‌-3 వాహనాలను నకిలీ పత్రాలతో రిజిస్టర్‌ చేయించిన యాజమాన్యం. 33 బస్సులు, లారీలను కర్నాటకలో నడుపుతున్న దివాకర్‌ ట్రావెల్స్. లోకాయుక్తకు ఆధారాలు సమర్పించిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి. కర్నాటక రవాణాశాఖ అధికారుల పాత్రపైనా ఫిర్యాదు.

అవును ప్రభాసే, నమ్మండి !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. భారతీయ చిత్ర సీమలో ఈ పేరు ఓ ప్రభంజనం. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ అందనంత ఎత్తుకు ఎగసింది.

Prabhas old photo goes viral, అవును ప్రభాసే, నమ్మండి !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. భారతీయ చిత్ర సీమలో ఇప్పుడు ఈ పేరు ఓ ప్రభంజనం. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ అందనంత ఎత్తుకు ఎగసింది. కండలు తిరిగిన దేహం, ఆరడుగులు ఎత్తు, ఆకట్టుకునే రూపంతో ప్రభాస్ ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలకు మోస్ట వాంటెడ్ హీరో. ఇప్పుడు ప్రభాస్ రేంజ్ వేరు కానీ కెరీర్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా సరైన హిట్ కోసం చాన్నాళ్లు ఎదురుచూశాడు. స్టార్ స్టేటస్ అందడానికి కూడా చాలా టైమ్ పట్టింది.  ఇక కెరీర్ ప్రారంభంలో ప్రభాస్ చేసిన ఫోటోషూట్స్ కు సంబంధించిన ఫోటో ఇప్పుడు బయటకు వచ్చింది. గడ్డం, మీసం లేకుండా గన్ తో ఉన్న ప్రభాస్ లుక్  భలే విచిత్రంగా ఉంది.  ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే  కావడంతో  ప్రభాస్ ఫ్యాన్స్ పాత ఫోటోలను వెలికి తీస్తున్నారు. కాగా ఇప్పట్నుంచే సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ బర్త్ డే ట్రెండ్స్ ప్రారంభించారు అభిమానులు.

ఇక  సినిమాల విషయానికి వస్తే ప్రజంట్ రాధే శ్యామ్ సినిమాతో నటిస్తున్నాడు ప్రభాస్.  నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ తో పాటు,  ఆది పురుష్ సినిమాలు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఇవన్నీ ప్యాన్ ఇండియా రేంజ్ చిత్రాలే.

విషాదం, నేరెడిమేట్‌లో మిస్సైన బాలిక మృతదేహం లభ్యం

వైఎస్ వివేకా హత్యకేసులో లేటెస్ట్ అప్డేట్

ఫారెన్ నుంచి కాస్ట్లీ గిఫ్ట్ వచ్చిందంటూ మహిళకు టోకరా

 

Related Tags