Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

ఏంటి డార్లింగ్..ఇదేనా సంక్రాంతి సర్‌‌ప్రైజ్

Prabhas 20: Prabhas resumes shooting for his upcoming film, ఏంటి డార్లింగ్..ఇదేనా సంక్రాంతి సర్‌‌ప్రైజ్

‘సాహో’ తర్వాత తన నెక్ట్స్ మూవీ కోసం ప్రభాస్ లవర్ బాయ్‌గా మారిపోయాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సెన్సిబుల్ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు డార్లింగ్. అయితే ఈ మూవీ షూటింగ్ వివిధ కారణాల వల్ల ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడింది. ఫ్యాన్స్ మాత్రం తమ డార్లింగ్ సినిమా అప్డేట్ కోసం ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్నారు.  గురువారం ప్రభాస్‌ మూవీ యూనిట్ చేసిన అనౌన్సిమెంట్ వారిలో అంచనాలను పెంచేసింది. శుక్రవారం… ప్రభాస్‌ ఓ క్రేజీ అప్‌డేట్ ఇస్తున్నారంటూ ప్రచారం చేశారు. దీంతో ఫ్యాన్స్ మూవీ ఫస్ట్ లుక్ లేదా టైటిల్ ప్రకటిస్తారేమో అని ఆశపడ్డారు. శుక్రవారం రానే వచ్చింది. కానీ సీన్ రివర్సయ్యింది.

ఈ రోజు నుంచి షూటింగ్ పున:ప్రారంభించబోతున్నాం అంటూ ఓ క్యాజువల్ పిక్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు డార్లింగ్. అందులో కూడా ప్రభాస్ స్ట్రయిట్ లక్ లేదు. ఓ హాల్లో పియానో పక్కన నిల్చోని గోడకు ఉన్నపెయింటింగ్స్ వైపు తదేకంగా చూస్తూ ఉన్నాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్‌గా డిసప్పాయింట్ అయ్యారు. ఇదేంటి డార్లింగ్ అంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కాగా పీరియాడిక్‌ రొమాటింక్‌ డ్రామాగా ప్రభాస్ నయా మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌, గోపీ కృష్ణ మూవీస్‌ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ వేసవిలో మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది యూనిట్.

Related Tags