ప్రేమ పేరుతో వ్య‌క్తి మోసం..అత‌డికి కానిస్టేబుళ్ల స‌హ‌కారం..

ప్రేమ గుడ్డిదే అవ్వొచ్చు. కానీ ప్రేమించేవాళ్లు కాదుగా. అందుకే ప్రేమించే ముందు కాస్త ముందు వెనుక..వారి గుణ‌‌గ‌ణాలు తెలుసుకోని ముందుకు వెళ్లాలి. లేక‌పోతే పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది.

ప్రేమ పేరుతో వ్య‌క్తి మోసం..అత‌డికి కానిస్టేబుళ్ల స‌హ‌కారం..
Follow us

|

Updated on: Jul 13, 2020 | 4:11 PM

ప్రేమ గుడ్డిదే అవ్వొచ్చు. కానీ ప్రేమించేవాళ్లు కాదుగా. అందుకే ప్రేమించే ముందు కాస్త ముందు వెనుక..వారి గుణ‌‌గ‌ణాలు తెలుసుకోని ముందుకు వెళ్లాలి. లేక‌పోతే పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది. తాజాగా నర్సరావుపేటలో ప్రేమ పేరుతో వంచించి ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించిన ప్రియుడు శివానంద్ ఆట క‌ట్టించారు పోలీసులు. ఆమె వ‌ద్ద నుంచి అత‌డు ప‌లుమార్లు డ‌బ్బు వ‌సూలు చేసిన‌ట్టు గుర్తించారు. యువ‌తి బంగారు గాజుల‌ను సైతం అత‌డు కాజేసినట్టు పోలీసుల విచార‌ణ‌లో వెల్లడైంది. దీంతో శివానంద్ ను అరెస్టు చేశారు పోలీసులు. అయితే ఈ కేసులో కానిస్టేబుళ్లపై కూడా ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. బంగారు గాజుల విష‌యంలో వారి పాత్ర కూడా యువ‌తి ఫిర్యాదులో వెల్ల‌డించింది. శివానంద్‌కు ఈపూరు, రొంపిచర్ల పోలీస్‌‌స్టేషన్లలో పనిచేసే కానిస్టేబుళ్లు స‌హ‌రించిన‌ట్టు స‌మాచారం. అయితే ఈ విష‌యాన్ని పోలీసులు ధృవీకరించ‌డం లేదు. కావాల‌నే కానిస్టేబుళ్ల‌ను కేసు నుంచి త‌ప్పించిన‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.