Breaking News
  • విశాఖ శారదాపీఠంలో విషజ్వర పీడా హర యాగానికి పూర్ణాహుతి. 11 రోజుల పాటు సాగిన అమృత పాశుపత సహిత యాగం. యాగాన్ని పర్యవేక్షించిన శారదా పీఠాధిపతులు.. స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర.
  • కరోనా వల్ల ఆక్వా రంగం ఇబ్బందుల్లో ఉంది. వాలంటీర్ల ద్వారా ప్రజల సమాచారం సేకరిస్తున్నాం. నిత్యావసరాల ధరలు పెరగకుండా చూస్తున్నాం. రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా చూస్తున్నాం-మోపిదేవి.
  • ప్రజల రాకపోకలపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నాం-మంత్రి కన్నబాబు. కరోనా వ్యాప్తి చెందకుండా నిరోధించడం. ప్రజలకు సాయం అందించడం. ఫారెన్‌ రిటర్న్స్‌ను గుర్తించేందుకు ప్రత్యేక వ్యూహం-కన్నబాబు.
  • రాష్ట్రంలో పాల సరఫరాపై వివిధ డైరీలతో మంత్రి తలసాని సమీక్ష. డోర్‌డెలివరీ యాప్‌ల ద్వారా పాల సరఫరా. పాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు-మంత్రి తలసాని. పాల వాహనాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు-తలసాని.
  • నిజామాబాద్‌లో కల్లు దొరకక ఇద్దరు మృతి. లాక్‌డౌన్‌ కారణంగా వారం రోజులుగా దొరకని కల్లు.
  • లాక్‌డౌన్‌తో చెన్నైలో విజయనగరం వాసుల అవస్థలు. తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న కూలీలు. టీవీ9కు తమ గోడు చెప్పుకున్న కూలీలు.

అప్పడే విజయాల్ని తీసుకొచ్చిన భాగస్వాములు..

లేడీ లక్ టాలీవుడ్ యువ హీరోలకు బాగా పనిచేసినట్లు అనిపిస్తుంది. నిఖిల్, నితిన్..వారి లైఫుల్లోకి త్వరలో ఆహ్వానించబోయే భాగస్వాములు మంచి అదృష్టాన్ని తెచ్చినట్టే కనిపిస్తోంది.  'లై', 'చల్ మోహన్ రంగ', 'శ్రీనివాస కల్యాణం' సినిమాలతో హ్యాట్రిక్ ప్లాపులు అందుకున్న నితిన్.. చివరికి 'భీష్మా'తో సాలిడ్ హిట్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
Lady luck seems to have worked well for young heroes, అప్పడే విజయాల్ని తీసుకొచ్చిన భాగస్వాములు..

లేడీ లక్ టాలీవుడ్ యువ హీరోలకు బాగా పనిచేసినట్లు అనిపిస్తుంది. నిఖిల్, నితిన్..వారి లైఫుల్లోకి త్వరలో ఆహ్వానించబోయే భాగస్వాములు మంచి అదృష్టాన్ని తెచ్చినట్టే కనిపిస్తోంది.  ‘లై’, ‘చల్ మోహన్ రంగ’, ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాలతో హ్యాట్రిక్ ప్లాపులు అందుకున్న నితిన్.. చివరికి ‘భీష్మా’తో సాలిడ్ హిట్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. సెంటిమెంట్‌ ప్రధానంగా నడిచే టాలీవుడ్‌లో..ఇప్పుడు చాలా మంది ‘భీష్మా’ విజయానికి లేడీ లక్కే  కారణమని చెబుతున్నారు. ఇటీవల తన ప్రియురాలు షాలినితో నిశ్చితార్థం చేసుకున్న నితిన్‌కు వారం తిరక్కుండానే అదిరిపోయే హిట్ అందింది. షాలిని వారి కుటుంబంలోకి రాబోతుండటంతోనే హిట్ అందిందని..చాలామంది నితిన్, అతని తండ్రి సుధాకర్ రెడ్డిని అభినందిస్తున్నారట. కాగా ఏప్రిల్ 16 న దుబాయ్‌లో నితిన్, షాలిని వివాహ వేడుకతో ఒక్కటి కాబోతున్నారు. ఇక చాలామందికి తెలియని విషయం ఏంటంటే..నితిన్‌కు కాబోయే భార్య షాలిని ‘భీష్మా’ మూవీని సంధ్య థియేటర్‌లో ఫస్ట్ డే, ఫస్ట్ డే చూసేశారు. ఆమెకు మూవీ తెగ నచ్చిందట. నితిన్‌కు యాక్టింగ్ అదుర్స్ అంటూ కాంప్లిమెంట్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఇక మరో యంగ్ హీరో నిఖిల్‌కి కూడా..అతని జీవిత భాగస్వామి పల్లవి వర్మతో మ్యారేజ్ ఫిక్స్ అయిన వెంటనే ‘అర్జున్ సురవరం’ రూపంలో మంచి విజయం లభించింది. మంచి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటాడన్న పేరున్న నిఖిల్‌కు ఈ మూవీకి ముందు చేసిన ‘కేశవ’, ‘కిర్రాక్ పార్టీ’ లాంటి సినిమాలు పెద్ద పేరును తీసుకురాలేదు. ‘కేశవ’ యావరేజ్ అయితే, ‘కిర్రాక్ పార్టీ’ పూర్తిగా నిరాశపరిచింది. దీంతో కెరీర్‌కి హిట్ చాలా అవసరమైన దశలో ‘అర్జున్ సురవరం’తో లేటుగా వచ్చినప్పటికి మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు నిఖిల్. ఈ చిత్రం విజయం సాధించడానికి కారణం అతని కాబోయే భార్యే అంటూ స్నేహితులు, కుటుంబ సభ్యులు కంగ్రాట్స్ చెప్పారట. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..నిఖిల్ కూడా ఏప్రిల్ 16 న హైదరాబాద్‌లో తన ప్రేయసి పల్లవి మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. 

ఇది కూడా చదవండి: భార్య ప్రసవం కోసం ఆస్పత్రిలో..భర్త గుండెపోటుతో మృతి…

Related Tags