Breaking News
  • విశాఖ: సింహాద్రి అప్పన్నస్వామికి స్వర్ణ తులసీ దళాలు సమర్పణ. రూ.25 లక్షలు విలువైన 50 స్వర్ణ తులసీ దళాలు సమర్పించిన బోకం శ్రీనివాసరావు దంపతులు. గతంలోనూ పలు కానుకలు సమర్పించిన శ్రీనివాసరావు.
  • అమరావతి: ఓఎన్‌జీసీ, గెయిల్‌ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి భేటీ. మత్స్యకారులకు చేయూతనివ్వాలని కోరిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కార్పొరేట్‌ రెస్పాన్స్‌బిలిటీ కింద 2శాతం చెల్లించాలని కోరిన మంత్రి. గతంలో రూ.150 కోట్లు ఇస్తామని ఓఎన్‌జీసీ, గెయిల్‌ అంగీకారం. బకాయిలు రూ.82.12 కోట్లు వెంటనే చెల్లించాలని కోరిన పెద్దిరెడ్డి. ఆయిల్ నిక్షేపాల వెలికితీత సమయంలో మత్స్య సంపదకు నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన.
  • తిరుపతి: మీడియాతో మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి చిట్‌చాట్‌. పీసీసీ చీఫ్‌ పదవి మీడియా ఊహగానాలేనన్న కిరణ్‌కుమార్‌రెడ్డి. పీసీసీ చీఫ్‌ పదవిపై అంతగా ఆసక్తి లేదన్న మాజీ సీఎం. తాజా రాజకీయాల తీరుపై తీవ్ర అసంతృప్తి. తాను తిరుపతిలో తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించానన్న కిరణ్‌. చిత్తూరు జిల్లాలో తాను ప్రారంభించిన తాగు, సాగు నీరు ప్రాజెక్టు కొనసాగించకపోవడం పట్ల ఆవేదన. తిరుపతిలో అంతర్జాతీయ స్టేడియం నిర్మించకపోవడంపై అసంతృప్తి.
  • సైదాబాద్‌ పీఎస్‌లో అక్బరుద్దీన్‌పై కేసునమోదు. అక్బరుద్దీన్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని సైదాబాద్‌ పోలీసులను ఆదేశించిన నాంపల్లి కోర్టు. భారత దేశ సార్వభౌమత్వాన్ని సవాల్‌ చేసిన అక్బరుద్దీన్‌. న్యాయవాది కరుణసాగర్‌ ఫిర్యాదుతో కేసునమోదు.
  • గుంటూరు: దుర్గి మండలం ధర్మవరంలో జనసేన నేతల పర్యటన. బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలకు పరామర్శ. గ్రామంలో తిరునాళ్ల సందర్భంగా పోలీసులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ. గురజాల డీఎస్పీ శ్రీహరిని కలిసిన జనసేన నేతలు. గొడవతో సంబంధం లేని వారిని కేసుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి. గురజాల సబ్‌జైలులో ఉన్న ధర్మవరం జనసైనికులకు పరామర్శ.
  • తూ.గో: రాజమండ్రి దగ్గర పురాతన హెవలాక్‌ బ్రిడ్జిని పరిశీలించిన ఎంపీ మార్గాని భరత్‌, టూరిజం ఎండీ ప్రవీణ్‌కుమార్‌. హెవలాక్‌ బ్రిడ్జిని పర్యాటక కేంద్రంగా తీర్చుదిద్దనున్న ప్రభుత్వం. వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌, ఫుడ్‌బజార్‌, ఫ్యాషన్‌ బజార్లకు ఏర్పాటు. 40 అడుగుల మేర ట్రాక్‌ ఏర్పాటు చేయాలని కోరిన ఎంపీ. త్వరలో పనులు ప్రారంభిస్తామన్న ఎండీ ప్రవీణ్‌కుమార్‌.

హిందీపై తలైవా కూడా.. ఆ ప్రసక్తే లేదన్న రజనీ

A common language not just for India but any country is good for its unity and progress., హిందీపై తలైవా కూడా.. ఆ ప్రసక్తే లేదన్న రజనీ

దేశవ్యాప్తంగా హిందీని ఉమ్మడి అధికార భాషగా చేయాలన్న హోం మంత్రి అమిత్ షా ప్రతిపాదనకు ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు నో చెప్పేశాయి. ఈ రాష్ట్రాల సీఎం లు, సినీ ప్రముఖులు, బీజేపీయేతర పార్టీల నేతలు షా సూచనను వ్యతిరేకిస్తున్నారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ దీనిపై స్పందిస్తూ ఉమ్మడి భాష అనే సిధ్ధాంతాన్ని బలవంతంగా రుద్దడం సరికాదన్నారు. బుధవారం చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ దేశంలో ‘ దురదృష్టవశాత్తూ ‘ ఈ ప్రతిపాదన హేతుబధ్ధం కాదని తేల్చారు. కామన్ లాంగ్వేజ్ అన్నది ఈ దేశానికే కాదు.. మరే దేశానికీ మంచిది కాదు అని ఆయన వ్యాఖ్యానించారు.’ తమిళనాడే కాదు.. ఏ దక్షిణాది రాష్ట్రమూ ఇందుకు ఒప్పుకోదు.. అలాగే ఉత్తరాదిలో పలు రాష్ట్రాలు కూడా అంగీకరించబోవు ‘ అని రజనీ పేర్కొన్నారు.కాగా- అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ నెల 20 న తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహిస్తామని డీఎంకె ప్రకటించింది. ఇది నిరంకుశ నిర్ణయమని ఈ పార్టీ అధినేత స్టాలిన్ విమర్శించారు. ఎన్డీయే సర్కార్ లో భాగస్వామిగా ఉన్న అన్నా డీఎంకె కు చెందిన మంత్రి కె. పాండ్యరాజన్ కూడా షా ప్రకటనను వ్యతిరేకించారు.

A common language not just for India but any country is good for its unity and progress., హిందీపై తలైవా కూడా.. ఆ ప్రసక్తే లేదన్న రజనీ

 

హిందీని ఏకపక్షంగా రుద్దిన పక్షంలో తమిళనాడులోనే కాక , పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో కూడా ఆందోళనలు మొదలవుతాయని ఆయన చెప్పారు. అటు-షా సూచనపై ఏపీ, తెలంగాణ ఎలాంటి స్పందనా వ్యక్తం చేయకపోయినప్పటికీ.. ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. హిందీని అధికార భాషగా చేయాలన్న ప్రతిపాదనను తోసిపుచ్చారు. హిందీ ప్రతి భారతీయుని మాతృ భాష కాదు.. ఆర్టికల్ 29 ప్రకారం ప్రతి భారతీయునికి తన భాషను ఎంచుకునే హక్కు ఉంటుంది ‘ అని ఆయన వ్యాఖ్యానించారు.
నిజానికి ఈ ప్రతిపాదనపై డిబేట్ ఈనాటిది కాదు.. సుమారు వంద సంవత్సరాల క్రితమే దీనిపై మహాత్మా గాంధీ కూడా స్పందించారు. తన ఆటోబయాగ్రఫీలో ఆయన.. హిందీతో బాటు సంస్కృతం, పర్షియన్, అరబిక్, ఇంగ్ల్లీష్ భాషలను కూడా విద్యా సంస్థల్లో బోధించాలని సూచించారు. అంతేకాదు.. హిందీ, గుజరాతీ, సంస్కృత భాషలను ఒకే భాషగా పరిగణించవచ్ఛునని అభిప్రాయపడ్డారు. 1963 నాటి అధికార భాషా చట్టం ప్రకారం.. హిందీ, ఇంగ్ల్లీష్ భాషలను కేంద్రం, పార్లమెంటు అధికార భాషలుగా గుర్తించాయి. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూలు కింద దేశంలో మొత్తం 22 భాషలను ఇలా గుర్తించారు.