ధోని అద్భుత ఆటగాడు: యోగిరాజ్ సింగ్

టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని నిత్యం విమర్శించే యువరాజ్ సింగ్ తండ్రి యోగిరాజ్ సింగ్ తొలిసారి ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా న్యూస్ 24 స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్యూలో యోగిరాజ్ సింగ్ మాట్లాడుతూ 2019 ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియా ఓటమికి ధోనీయే కారణమని తాను చెప్పలేదని పేర్కొన్నాడు. పంచకప్ ముగిసిన తర్వాత పారామిలటరీ రెజిమెంట్‌లో సేవలందించేందుకు రెండు నెలల పాటు టీమిండియాకు అందుబాటులో ఉండనని బీసీసీఐకి ధోనీ తెలిపిన విషయం తెలిసిందే. […]

ధోని అద్భుత ఆటగాడు: యోగిరాజ్ సింగ్
Follow us

| Edited By:

Updated on: Jul 25, 2019 | 11:26 PM

టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని నిత్యం విమర్శించే యువరాజ్ సింగ్ తండ్రి యోగిరాజ్ సింగ్ తొలిసారి ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా న్యూస్ 24 స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్యూలో యోగిరాజ్ సింగ్ మాట్లాడుతూ 2019 ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియా ఓటమికి ధోనీయే కారణమని తాను చెప్పలేదని పేర్కొన్నాడు. పంచకప్ ముగిసిన తర్వాత పారామిలటరీ రెజిమెంట్‌లో సేవలందించేందుకు రెండు నెలల పాటు టీమిండియాకు అందుబాటులో ఉండనని బీసీసీఐకి ధోనీ తెలిపిన విషయం తెలిసిందే.

దీంతో ఆగస్టు 3 నుండి ప్రారంభమయ్యే వెస్టిండిస్ పర్యటకు ధోని దూరమయ్యాడు. ధోనినే స్వయంగా తప్పుకోవడంతో అతడి స్థానంలో యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ను వికెట్‌ కీపర్‌గా ఎంపిక చేశారు. టెస్టులకు మాత్రం వృద్ధిమాన్‌ సాహాను ప్రత్యామ్నయ వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు. విండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా 3 వన్డేలు, 3 టీ20లు, 2 టెస్టులు ఆడనుంది.