Breaking: ఎస్ బ్యాంక్ సంక్షోభం.. అనిల్ అంబానీపైనా నీలినీడలు..ఈడీ సమన్లు

ఎస్ బ్యాంక్ ఫౌండర్ రానాకపూర్ నిర్వాకం ఫలితంగా సంక్షోభంలో కూరుకుపోయిన ఈ బ్యాంకు ఫ్రాడ్ కు సంబంధించి ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ పైనా అనుమానపు నీలినీడలు పరచుకున్నాయి.

Breaking: ఎస్ బ్యాంక్ సంక్షోభం.. అనిల్ అంబానీపైనా నీలినీడలు..ఈడీ సమన్లు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 16, 2020 | 10:49 AM

ఎస్ బ్యాంక్ ఫౌండర్ రానాకపూర్ నిర్వాకం ఫలితంగా సంక్షోభంలో కూరుకుపోయిన ఈ బ్యాంకు ఫ్రాడ్ కు సంబంధించి ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ పైనా అనుమానపు నీలినీడలు పరచుకున్నాయి. రానాకపూర్ ని ఈడీ రోజులతరబడి విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్ బ్యాంకు నుంచి అత్యధికంగా రుణాలు తీసుకున్న సంస్థల్లో రిలయన్స్ గ్రూప్ కూడా ఒకటి. ఈ కంపెనీ రూ. 14 వేల కోట్ల రుణాలు తీసుకుందని ఈడీ అధికారి ఒకరు తెలిపారు. ఈ బ్యాంకు నుంచి భారీగా అప్పులు తీసుకున్న బడా సంస్థల వివరాలను తాము తెలుసుకుంటున్నామని ఆయన చెప్పారు. రానాకపూర్ ఈ బ్యాంకు సీఈఓగా ఉన్నప్పుడు రూల్స్ ని బేఖాతరు చేసి అనేక కంపెనీలకు రుణాలు మంజూరు చేశారు.

అనిల్ అంబానీని ఇవాళ ఈడీ విచారించనుంది. ఎస్ బ్యాంక్ నుంచి ఎప్పుడెప్పుడు రుణాలు తీసుకున్నారు, షరతులు, నిబంధనలు, ఒప్పందాలు తదితరాలపై ఆయనను ప్రశ్నించనున్నారు. నిర్మాణ రంగానికి సంబంధించి మంజూరు చేసిన రుణాల్లో రిలయన్స్ గ్రూప్ అత్యధికంగా అప్పులు తీసుకున్నట్టు వెల్లడైందని ఈడీ అధికారి చెప్పారు. రానాకపూర్ హయాంలో భారీ మొత్తంలో రుణాలు తీసుకున్న టాప్ అయిదు సంస్థల జాబితాను ఈడీ రెడీ చేస్తోంది. ఈ బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్న బడా పారిశ్రామికవేత్తల్లో చాలామంది డీఫాల్టర్లుగా మారారని ఈడీ గుర్తించింది. ఇవన్నీ ఇక బ్యాడ్ లోన్స్ అన్నమాటే ! కాగా..కపూర్ కుటుంబంతో తమకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి లింక్ లేదని రిలయన్స్ గ్రూప్ అధికారి ఒకరు స్పష్టం చేశారు.వోడా ఫోన్ ఐడియా, డీ హెచ్ ఎఫ్ ఎల్, ఎస్సెల్  గ్రూప్, సీజీ పవర్ వంటి సంస్థలు ఎస్ బ్యాంకు నుంచి భారీగా రుణాలు తీసుకున్నాయి.

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..