ఓటేసిన ఆ అందాల భామ… వైరల్ అవుతున్న ఫోటో

ఆమె జాలువారే పొడవాటి కురులు.. కళ్లకు నల్లని చలువ అద్దాలు.. చేతుల్లో ఈవీఎం పెట్టెలు.. మెడలో ఈసీ గుర్తింపు కార్డు.. పసుపుపచ్చని చీరలో తన అందాలను ఒలకబోసిన ఆ పోలింగ్ బ్యూటీని నెట్టింట్లో చూడని వారు ఉండకపోవచ్చు. సార్వత్రిక ఎన్నికల వేళ సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫొటో అంతగా చక్కర్లు కొట్టింది మరి. ‘ఆ పోలింగ్‌ బూత్‌లో వంద శాతం ఓటింగ్‌’ అంటూ ఆమె నాజూకైన అందంపై సరదాగా పెద్ద ఎత్తున ట్రోల్ జరిగింది.

ఐదో విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా లక్నోలోని నగరామ్‌ పోలింగ్‌ బూత్‌ అధికారిణిగా నియమితులైన రీనా.. ఈవీఎం పెట్టెలను తీసుకెళ్తుంటే.. ఓ వ్యక్తి ఆమెను ఫొటో తీసి.. పోస్ట్ చేశారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆమె అందాలను చూసేందుకు ఓటర్లంతా ఆమె పోలింగ్ బూత్‌కి బారులు తీరారని వార్తలు వచ్చాయి. అంతేకాదు.. ఆమె విధులు నిర్వహించిన పోలింగ్‌ బూత్‌లో ‘వంద శాతం ఓటింగ్‌’ అనే ప్రచారం జరిగింది. అయితే వాస్తవానికి ఆ బూత్‌లో పోలింగ్‌ 70 శాతం మాత్రమే. ఇది చెప్పింది ఎవరో కాదు… స్వయంగా రీనానే. అయితే గతంతో పోలిస్తే ఇక్కడ ఓటింగ్‌ శాతం బాగా పెరిగిందని.. కానీ అందరూ ఊహించినట్టుగా దానికి కారణం తాను మాత్రం కాదని తెలిపింది. ప్రజల్లో ఓటుపై అవగాహన పెరగడంవల్లే ఇది సాధ్యమైందని రీనా వెల్లడించింది.

అయితే ఒక్క ఫోటోతోనే ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయిన రీనా ద్వివేది ఆదివారం జరిగిన ఆఖరి విడత ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో పీడబ్ల్యూడీ విభాగంలో పనిచేస్తున్న రీనా.. దేవరియాలోని తన స్వగ్రామమైన పన్సర్షిలో ఓటు వేశారు. ఈ సారి పింక్ అండ్ గ్రీన్ కలర్ శారీ ధరించి ఆమె ఫొటోకు ఫోజిచ్చారు. చేతిలో ఓటరు గుర్తింపు కార్డును పట్టుకుని, సిరా గుర్తు ఉన్న చూపుడు వేలును చూపించారు. ఇప్పుడు ఆమె తాజా ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *