సీఎం రాజకీయ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం.. స్పందించిన ముఖ్యమంత్రి

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజకీయ కార్యదర్శి సంతోష్ ఆత్మహత్యాయత్నం చేశారు. నిన్నరాత్రి ఆయన నిద్రమాత్రలు మింగి బలన్మరణానికి పాల్పడ్డారు….

  • Rajeev Rayala
  • Publish Date - 7:58 am, Sat, 28 November 20

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజకీయ కార్యదర్శి సంతోష్ ఆత్మహత్యాయత్నం చేశారు. నిన్నరాత్రి ఆయన నిద్రమాత్రలు మింగి బలన్మరణానికి పాల్పడ్డారు. వెంటనే ఆయనను బెంగళూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు. తన రాజకీయ కార్యదర్శి ఆత్మహత్యకు ప్రయత్నించడం పై సీఎం యడ్యూరప్ప స్పందించారు. సంతోష్ కుటుంబ సభ్యులతో మాట్లాడానని, ఆయన ఎందుకు ఆత్మహత్యయత్నం చేశారో కారణం తెలియలేదని అన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని యడ్యూరప్ప తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంతోష్ ను యడ్యూరప్ప పరామర్శించారు.