నిర్బంధంలో సీపీఎం నేత.. సుప్రీంకు సీతారాం ఏచూరి!

Yechury moves SC for production of detained CPI(M) leader Tarigami, నిర్బంధంలో సీపీఎం నేత.. సుప్రీంకు సీతారాం ఏచూరి!

జమ్ముకశ్మీర్‌లో గృహనిర్బంధంలో ఉన్న తమ పార్టీ నేత మహ్మద్‌ యూసఫ్‌ తరిగమి విడుదల కోరుతూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సుప్రీంకోర్టుకు వెళ్లారు. యూసఫ్‌ను కోర్టులో ప్రవేశపెట్టేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

సీపీఎం సెంట్రల్‌ కమిటీ సభ్యుడైన యూసఫ్‌ జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీకి నాలుగుసార్లు ఎన్నికయ్యారు. ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా మాజీ ముఖ్యమంత్రులు ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా పలు రాజకీయ పార్టీల నేతలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచిన విషయం విదితమే. వారిలో యూసఫ్‌ కూడా ఉన్నారు. అయితే నిర్బంధంలో ఉన్న యూసఫ్‌ అనారోగ్యానికి గురైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. యూసఫ్‌ను చూసేందుకు ఏచూరి కశ్మీర్‌ వెళ్లగా.. ఎయిర్‌పోర్టులోనే ఆయనను భద్రతాసిబ్బంది అడ్డుకున్నారు. కశ్మీర్‌లోకి అనుమతించకుండా తిరిగి ఢిల్లీ పంపించారు. దీంతో తమ పార్టీ నేత ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన ఏచూరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యూసఫ్‌ను త్వరితగతిన కోర్టు ముందుకు తీసుకొచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *