Breaking News
  • భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 106750 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 61149 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 42298 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 3303 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • విశాఖ డాక్టర్ ను హైకోర్టులో హాజరు పరచానున్న పోలీసులు . నేడు విశాఖ డాక్టర్ సుధాకర్ ను హైకోర్టులో హాజరపరచనున్న విశాఖ పోలీసులు . సుధాకర్ పట్ల పోలీసులు, ప్రభుత్వం అనుచితంగా ప్రవర్తించిందని హైకోర్టుకి ఫిర్యాదు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనిత . అనిత ఫిర్యాదు సుమోటోగా స్వీకరించిన హైకోర్టు . సుధాకర్ ను నేడు కోర్టులో హాజరు పరచాలన్న హైకోర్టు.
  • మరికాసేపట్లో ప్రారంభం కానున్న కేంద్ర కేబినెట్ సమావేశం. లాక్‌డౌన్ పరిస్థితులు, కరోనా వ్యాప్తి అంశాలపై చర్చ. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే చర్యలు, సంస్కరణలపై సమాలోచనలు. చిన్న, మధ్య తరహా పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చే నిర్ణయాలకు అవకాశం. ఉమ్ పున్ తుఫానుపైనా చర్చించే అవకాశం.
  • దూసుకొస్తున్న ఉమ్‌పున్: నేడు బెంగాల్‌-బంగ్లా మధ్య తీరం దాటనున్న ఉమ్‌పున్. గంటకు 185 కి.మీ.వేగంతో వీయనున్న గాలులు. లక్షలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు
  • కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు రాసిన లేఖను అందుకున్న తెలంగాణ ప్రభుత్వం... ఒకటి రెండు రోజుల్లో కృష్ణ బోర్డుకు వివరణ ఇవ్వనున్న తెలంగాణ సర్కార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మించినవే అని వివరించే అవకాశం. పాలమూరు రంగారెడ్డి గత ప్రభుత్వాల హయాంలోనే అపెక్స్ కమిటీ లో నిర్ణయించుకున్నట్లుగా కృష్ణ బోర్డుకు తెలియజేయనున్న తెలంగాణ.
  • కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ. ఇవాళ రాష్ట్రంలో 42 పాజిటివ్ కేసులు నమోదు. ఇప్పటి వరకు రాష్ట్రం లో మొత్తం. 1634 కేసులు నమోదు. కరోనా తో ఇవాళ నలుగురు మృతి.

భారత ఫుట్‌బాల్ టీమ్ సార‌థిపై నెటిజన్​ జాతి వివక్ష వ్యాఖ్యలు..

Shameful! Racist comments made towards Sunil Chhetri during Instagram Live with Virat Kohli, భారత ఫుట్‌బాల్ టీమ్ సార‌థిపై నెటిజన్​ జాతి వివక్ష వ్యాఖ్యలు..

భారత ఫుట్‌బాల్ టీమ్ సార‌థి‌ సునీల్‌ ఛెత్రి సోష‌ల్ మీడియాలో జాతి వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నాడు. ఇండియా క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్‌ కోహ్లితో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ చాట్‌ సందర్భంగా ఓ నెటిజన్‌ అతణ్ని ఉద్దేశించి.. “ఎవరీ నేపాలీ అంటూ ఓవ‌రాక్ష‌న్ చేశాడు. దీనిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా పెద్ద చర్చే జరిగింది. 13 ఏళ్లుగా ఇంట‌ర్నేష‌న‌ల్ ఫుట్‌బాల్ టీమ్ లో అద్భుతంగా స‌త్తా చాటుతూ‌.. ఎనిమిదేళ్లుగా జట్టుకు సార‌థిగా వ్య‌వ‌హ‌రిస్తోన్న‌ గొప్ప ఆటగాడిని ఉద్దేశించి ఇలా మాట్లాడడమేంటంటూ నెటిజన్లు ఫైర‌య్యారు. దీంతో ఆ వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ క్లోజ్ చేసి వెళ్లిపోయాడు.

ఇక ఈ చాట్‌ కార్యక్రమంలో ఛెత్రి అడిగిన చాలా ప్రశ్నలకు విరాట్ ఆన్స‌ర్స్ ఇచ్చాడు. జూనియర్ లెవ‌ల్ లో ఆడుతున్న‌ప్పుడు తన తండ్రి లంచం ఇవ్వనందుకు ఓసారి తనకు టీమ్ లో చోటివ్వలేదని కోహ్లి వెల్లడించాడు. సచిన్‌ ఇన్నింగ్స్‌ల్లో షార్జా సెంచ‌రీ (144) త‌న‌కు చాలా ఇష్టమ‌న్న‌ విరాట్‌.. అలాంటి ఇన్నింగ్స్‌ తానూ ఆడాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోను అభిమానించడానికి అతడి దూకుడే రీజ‌న్ అని కోహ్లి తెలిపాడు.

Shameful! Racist comments made towards Sunil Chhetri during Instagram Live with Virat Kohli, భారత ఫుట్‌బాల్ టీమ్ సార‌థిపై నెటిజన్​ జాతి వివక్ష వ్యాఖ్యలు..

Related Tags