చంద్రబాబుకు సరిగ్గా బ్రీఫ్డ్ చేసినట్టు లేరు- పీవీపీ

తనపై చేస్తున్న విమర్శలపై విజయవాడ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి పీవీపీ తీవ్ర స్థాయిలో స్పందించారు.  అవినీతి ఆరోపణలు చేసిన మీడియా సంస్థపై, వ్యక్తలపై చట్టం ద్వారానే పోరాడతానని చెప్పారు. కోల్గేట్ స్కామ్‌లో  పీవీపీపై మనీ లాండరింగ్ కేసు ఉందంటూ  సీఎం చంద్రబాబు చేసిన  విమర్శలకు పీవీపీ ఘాటుగా స్పందించారు. పక్కన ఉండేవాళ్లు చంద్రబాబు గారికి సరిగ్గా బ్రీఫ్డ్ చేయలేదేమోనని అన్నారు. ఇక  తెలుగు నిఘంటువులో యూటర్న్‌ అనే పదానికి చంద్రబాబు సరిగ్గా సరిపోతారని చెప్పారు. తనపై చేసిన […]

చంద్రబాబుకు సరిగ్గా బ్రీఫ్డ్ చేసినట్టు లేరు- పీవీపీ
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 15, 2019 | 3:54 PM

తనపై చేస్తున్న విమర్శలపై విజయవాడ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి పీవీపీ తీవ్ర స్థాయిలో స్పందించారు.  అవినీతి ఆరోపణలు చేసిన మీడియా సంస్థపై, వ్యక్తలపై చట్టం ద్వారానే పోరాడతానని చెప్పారు. కోల్గేట్ స్కామ్‌లో  పీవీపీపై మనీ లాండరింగ్ కేసు ఉందంటూ  సీఎం చంద్రబాబు చేసిన  విమర్శలకు పీవీపీ ఘాటుగా స్పందించారు. పక్కన ఉండేవాళ్లు చంద్రబాబు గారికి సరిగ్గా బ్రీఫ్డ్ చేయలేదేమోనని అన్నారు. ఇక  తెలుగు నిఘంటువులో యూటర్న్‌ అనే పదానికి చంద్రబాబు సరిగ్గా సరిపోతారని చెప్పారు. తనపై చేసిన ఎలిగేషన్స్‌కు సంబంధించి ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. కొందరు తప్పుడు కేసులు బనాయిస్తే కోర్టులు క్లీన్‌ చిట్‌ ఇచ్చాయని తెలిపారు. కావాలనే దుష్ప్రచారం చేసిన వారికి లా పవర్ ఏంటో చూపిస్తానని అన్నారు. టెక్నాలజీ గురించి మాటలు చెప్పే బాబు ఈవీఎంల మీద విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో కూడా ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగిన విషయం..చంద్రబాబు మర్చిపోయారేమో అని పీవీపీ ఎద్దేవా చేశారు. అనుకూల మీడియాలో చేయించిన దుష్ప్రచారానికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వ్యవస్థలను మేనేజ్ చేసేందుకు అవకాశం చిక్కనందునే.. చంద్రబాబు ఇంతలా ఫస్ట్రేట్ అవుతున్నారని పీవీపీ ఆరోపించారు. ఎవరెన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేసినా… తనని ఇంతటి వాడ్ని చేసిన పుట్టిన భూమి రుణం తీర్చుకుంటానని తెలిపారు.