Breaking News
  • దేశవ్యాప్తంగా దీపయజ్ఞం. ప్రధాని మోదీ పిలుపు మేరకు దీపాలు వెలిగించిన దేశ ప్రజలు. దీపం వెలిగించిన రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు. దీపాల కాంతుల్లో దేదీప్యమానంగా వెలుగొందిన భారత్‌. తెలుగు రాష్ట్రాల్లో దీపాల కాంతులు. ప్రగతి భవన్‌లో దీపాలు వెలిగించిన సీఎం కేసీఆర్‌. తాడేపల్లిలోని తన నివాసంలో దీపాలు వెలిగించిన ఏపీ సీఎం జగన్‌. దీపాలు వెలిగించిన తెలుగు రాష్ట్రాల గవర్నర్‌లు తమిళిసై, భిశ్వభూషణ్. తమ తమ నివాసాల్లో దీపాలు వెలిగించిన మంత్రులు, ఎమ్మెల్యేలు. అత్యవసరసేవలు అందిస్తున్న వైద్యులు, పోలీసులు.. పారిశుద్ధ్య సిబ్బందికి దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపిన ప్రజలు.
  • 130 కోట్ల ప్రజల మహాశక్తిని చాటిన భారతీయులు. దీప యజ్ఞంలో పాల్గొన్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు. కుటుంబ సమేతంగా దీపం వెలిగించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తన నివాసంలో దీపాలు వెలిగించిన ప్రధాని మోదీ. తమ తమ నివాసాల్లో దీపాలు వెలిగించిన కేంద్ర మంత్రులు, ఎంపీలు.
  • ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ ఫోన్‌. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు 20 కోట్ల గన్నీ బ్యాగ్‌లు అవసరం. ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్‌. గన్నీ బ్యాగ్‌లకు తీవ్ర కొరత ఉందని వివరించిన సీఎం కేసీఆర్‌. పశ్చిమబెంగాల్‌లో గన్నీ బ్యాగ్‌ల పరిశ్రమలు తెరిపించాలన్న కేసీఆర్‌. పరిశ్రమలు తెరిపిస్తేనే గన్నీ బ్యాగ్‌ల సమస్య తీరుతుందన్న కేసీఆర్‌. పశ్చిమ బెంగాల్‌ నుంచి ప్రత్యేక రైళ్ల ద్వారా గన్నీ బ్యాగ్‌లు.. తీసుకొచ్చేందుకు అనుమతించాలని ప్రధాని మోదీకి కేసీఆర్‌ విజ్ఞప్తి. సంబంధిత శాఖలతో మాట్లాడతానని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ.
  • ఒక్క తప్పుడు మెసేజ్‌ ఫార్వర్డ్‌ చేసినా కేసులు బుక్‌ చేస్తాం. వెరిఫై చేయకుండా సోషల్‌ మీడియాలో వీడియోలు షేర్‌ చేయొద్దు. డిజిటల్‌గా వెదికి పట్టుకుని అరెస్ట్‌ చేస్తాం. నిజాముద్దీన్‌ నుంచి వచ్చిన వారిలో ఎవరూ కావాలని.. కరోనా వ్యాప్తి చేశారనడానికి ఆధారాలు లేవు. -టీవీ9 ఎన్‌కౌంటర్‌ విత్‌ మురళీకృష్ణలో అంజనీకుమార్‌, సజ్జనార్‌.
  • కర్నూలులో కరోనా విజృంభణ. ఒకేరోజు 12 పాజిటివ్‌ కేసులు నమోదు. 12 మంది ఢిల్లీ సభలకు వెళ్లివచ్చిన వారే. కర్నూలులో మొత్తం 53 కరోనా కేసులు నమోదు. కాంటాక్ట్‌ కేసులపై దృష్టిపెట్టిన అధికారులు.

కేంద్ర కేబినెట్‌లోకి వైసీపీ.. మోదీని కల్సింది అందుకే!

ycp to join union cabinet, కేంద్ర కేబినెట్‌లోకి వైసీపీ.. మోదీని కల్సింది అందుకే!

చాలా కాలం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ భేటీ అయ్యారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశప్రధానిని కల్వడంలో పెద్దగా విశేషమేమీ లేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసమో.. పెండింగ్ అంశాల క్లియరెన్స్‌ కోసమో సీఎం ప్రధాన మంత్రిని కల్వడం సర్వ సాధారణం. అయితే.. తాజాగా జగన్, మోదీల భేటీ.. కేంద్రంలో మారుతున్న సమీకరణలకు సంకేతమంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీతో కలిసీ, కల్వనట్లు సంబంధాలు నెరపుతున్న వైసీపీని కేంద్ర కేబినెట్‌లో చేరాలని బీజేపీ తరచూ కోరుతున్న నేపథ్యంలోనే జగన్ సడన్‌గా ఢిల్లీకి పయనమయ్యారంటూ రాజకీయాలలో పెద్ద చర్చ మొదలైంది.

ఏపీ సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లారు. ప్రధానితో గంటకుపైగా సమావేశమయ్యారు. అంతే ఇక్కడ ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. జగన్‌ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఆ వార్త చక్కర్లు కొట్టడం కామన్‌గా మారింది. ఇంతకీ ఆ వార్తలో ఉన్న నిజమెంత? కేంద్ర కేబినెట్‌లో వైసీపీ చేరుతుందా? ఇదిప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.

కేంద్ర కేబినెట్‌లో వైసీపీ చేరుతుందని ఢిల్లీ వీధుల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది. కేంద్రంలో చేరే విషయంపై ప్రధానితో జగన్‌ చర్చించారని గుసగుసలు మొదలయ్యాయి. కేంద్రంలో వైసీపీ చేరితే రెండు కేబినెట్‌ బెర్త్‌లు దక్కుతాయని తెలుస్తోంది. రాజ్యసభ కోటాలో విజయసాయిరెడ్డి, లోక్‌సభ కోటాలో నందిగం సురేష్‌ కేంద్ర మంత్రులు అవుతారని టాక్‌ మొదలైంది. కేంద్రంలో అధికారంలో వున్న ఎన్డీయేలో వైసీపీ చేరుతుందని ఏడాదిగా ప్రచారం నడుస్తోంది. ఇటు బీజేపీ నేతలు కూడా వైసీపీ కేబినెట్‌లో చేరితే తమకు అభ్యంతరం లేదని ఆఫ్‌ ది రికార్డులో మాట్లాడుతున్నారు. వైసీపీ కేంద్ర ప్రభుత్వంలో చేరాలని సంకేతాలు పంపుతున్నారు.

కేంద్ర ప్రభుత్వంలో చేరుతుందన్న ప్రచారాన్ని వైసీపీ శ్రేణులు ఖండిస్తున్నాయి. విజయసాయిరెడ్డి లాంటి నేతలు కూడా ఈవార్తలను తోసిపుచ్చుతున్నారు. కేంద్రంలో తాము చేరే చాన్స్‌ లేదని… ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచో పుట్టుకోస్తాయో తెలియదని అంటున్నారు. ఇటు వైసీపీ కీలక నేతలు కేంద్రంలో చేరే విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. అయితే ప్రధాని మోదీ, సీఎం జగన్ భేటీపై ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. దాదాపు గంటన్నరపాటు సాగిన సమావేశంలో ఎక్కువగా రాజకీయాంశాలపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. పరస్పర ప్రయోజనాల రీత్యా పరస్పరం సహకారించుకోవాలన్న అంశంపైనే వీరిద్దరు ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. రాజ్యసభలో ప్రాంతీయ పార్టీల సహకారం కోరుతున్న బీజేపీ.. వైసీపీ నుంచి కూడా సహకారాన్ని ఆశిస్తోంది. వీరిద్దరి భేటీలో వైసీపీ సహకారాన్ని సాక్షాత్తు మోదీ ఆశించారని అంటున్నారు. ఏది ఏమైనా వీరిద్దరి భేటీలో అసలేం జరిగిందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Related Tags