టిడిపిలో మరో వికెట్ అవుట్!..గొట్టిపాటీ మీ దారెటు?

తెలుగుదేశం పార్టీలో రోజుకో వికెట్ పడుతోంది. వల్లభనేని వంశీ తర్వాత కొంత గ్యాప్ వచ్చినట్లు కనిపిస్తున్నా.. తెరచాటు రాజకీయం మాత్రం కంటిన్యూ అవుతున్నట్లే తెలుస్తోంది. తాజాగా ఈ జాబితాలోకి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చేరారు. ఆయన వైసీపీ అధినేత వైపు వెళ్ళింది లేదు. కానీ గొట్టిపాటి పార్టీ మారడం ఖాయమన్న ప్రచారం మాత్రం ప్రకాశం జిల్లాలో జోరుగా కొనసాగుతోంది. ఇంతకీ రవి మైండ్‌లో ఏముంది ? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. మే నెలలో జరిగిన […]

టిడిపిలో మరో వికెట్ అవుట్!..గొట్టిపాటీ మీ దారెటు?
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 25, 2019 | 4:09 PM

తెలుగుదేశం పార్టీలో రోజుకో వికెట్ పడుతోంది. వల్లభనేని వంశీ తర్వాత కొంత గ్యాప్ వచ్చినట్లు కనిపిస్తున్నా.. తెరచాటు రాజకీయం మాత్రం కంటిన్యూ అవుతున్నట్లే తెలుస్తోంది. తాజాగా ఈ జాబితాలోకి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చేరారు. ఆయన వైసీపీ అధినేత వైపు వెళ్ళింది లేదు. కానీ గొట్టిపాటి పార్టీ మారడం ఖాయమన్న ప్రచారం మాత్రం ప్రకాశం జిల్లాలో జోరుగా కొనసాగుతోంది. ఇంతకీ రవి మైండ్‌లో ఏముంది ? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.

మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన మర్నాటి నుంచి గొట్టిపాటి రవికుమార్ పార్టీ ఛేంజ్ అవుతారన్న ప్రచారం షురువైంది. తెలుగుదేశం పార్టీలో తనకు పెద్దగా భవిష్యత్ లేదని రవికుమార్ భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారం మొదలై ఆరు నెలలు కావస్తోంది. కానీ రవికుమార్ పార్టీ మారింది లేదు. కనీసం అసంతృప్తిగా ఆయన కనిపించింది లేదు. సన్నిహితుల దగ్గర కూడా ఓపెన్ అయి ఏమైనా మాట్లాడింది లేదు. మరి ప్రచారం మాత్రం ఎందుకు ఆగడం లేదు ?

రవికుమార్‌కు చెందిన గ్రానైట్ క్వారీలపై విజిలెన్స్ దాడులు కొనసాగుతున్నాయి. ఈయనకు చెందిన మూడు క్వారీలలో దాడులు జరిగాయి. విజిలెన్సు సోదాలు ఒకే సమయంలో మూడు చోట్ల జరగడం విశేషం. నిజానికి ఈ దాడులకు, రాజకీయాలతో సంబంధం వుందని కచ్చితంగా ఎవరూ చెప్పడం లేదు. కానీ గత 4 నెలలుగా గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని పలు క్వారీలపై విజిలెన్స్ దాడులు నిర్వహిస్తూనే వుంది. అందులో భాగంగానే గొట్టిపాటి క్వారీలపై దాడులు జరిగాయా ? లేక గొట్టిపాటిని అధికార పార్టీ టార్గెట్ చేసిందా అన్నది ఇదమిత్తంగా తేలనప్పటికీ.. ఈ దాడుల వెనుక అధికార పార్టీ పెద్దల ప్రోద్బలం వుందన్న కామెంట్లు జిల్లాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

గొట్టిపాటి రవి క్వారీలపై జరుగుతున్న దాడులకు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు లింకుందంటున్నారు పలువురు. ప్రకాశం జిల్లాలో గణనీయంగా ఉన్న సామాజిక వర్గానికి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో.. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి గొట్టిపాటిని లాగేస్తే.. ఆ సామాజిక వర్గం అధికార పార్టీ వైపు మొగ్గుచూపుతుందని కొందరు వైసీపీ నేతలు భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం సదరు సామాజిక వర్గం టిడిపి, వైసీపీల మధ్య చీలి వుందని, గొట్టిపాటి లాంటి వారిని లాగేస్తే.. ఆ సామాజిక వర్గం గంపగుత్తగా వైసీపీ వైపు మొగ్గు చూపుతుందని కొందరు అధికారపార్టీ నేతలు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ బర్త్ డే పార్టీలో గొట్టిపాటి పార్టీ మారే దిశగా అడుగులు పడినట్లు చెప్పుకుంటున్నారు. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మనవడి పుట్టినరోజు వేడుకలలో గొట్టిపాటి రవికుమార్ పాల్గొనడం చర్చనీయాంశమైంది. నవంబర్ 9న జరిగిన పుట్టినరోజు వేడుకల్లో ఏపీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలు రవికుమార్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. గొట్టిపాటి గతంలో చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఆ తర్వాత వైసీపీ తరపున కూడా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పాత పరిచయం నేపథ్యంలో గొట్టిపాటిని తిరిగి వైసీపీలోకి రావాలని ముగ్గురు మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని కోరినట్లు తెలుస్తోంది.

ఈ ముగ్గురు మంత్రులతో మరీ ముఖ్యంగా గొట్టిపాటి సొంత జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాస్ రెడ్డితో రవికుమార్‌కు సత్సంబంధాలున్నాయి. అందుకే వేరు వేరు పార్టీల్లో వున్నా బర్త్ డే పార్టీకి మంత్రి పిలవగానే గొట్టిపాటి వెళ్ళారని చెప్పుకుంటున్నారు. బాలినేని మాటను గొట్టిపాటి కాదనరని, అందుకే ఆయన ద్వారా వైసీపీ అధిష్టానం ఈ ఆపరేషన్ నడుపుతోందని తెలుస్తోంది. అయితే గొట్టిపాటి ఎటూ తేల్చకపోవడంతో వైసీపీ నేతలు కంగారుకు గురయ్యారని అంటున్నారు.

ఈ కన్ఫ్యూజన్‌ను తేల్చేసేందుకే గొట్టిపాటి రవికుమార్ గ్రానైట్ క్వారీలపై విజిలెన్స్ దాడులు జరిపేలా అధికార పక్షం చర్యలు తీసుకుందని చెప్పుకుంటున్నారు. 3 రోజుల పాటు 3 క్వారీల్లో విజిలెన్స్‌ అధికారులు దాడులు చేశారని ప్రచారం జరుగుతోంది. అవకతవకల పేరిట పెద్ద మొత్తంలో జరిమానాలు విధించి, పర్మిట్లు రద్దు చేసే అవకాశం వుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గొట్టిపాటి రవికుమార్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.