ఆయన ‘పాథలాజికల్ లయ్యర్’.. విజయసాయిరెడ్డి ట్వీట్

YCP MP Vijayasaireddy tweet on Chandrababu, ఆయన ‘పాథలాజికల్ లయ్యర్’.. విజయసాయిరెడ్డి ట్వీట్

రాజకీయ నాయకుల విమర్శలకు ప్రతివిమర్శలకు సోషల్ మీడియా వేదికగా మారింది. దీనిలో అగ్రభాగాన నిలిచేది ట్విట్టరే. ఎప్పుడూ ట్విట్టర్‌లో చురుగ్గా ఉండే వారిలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒకరు. ఆయన ట్వీట్ చేయడం మొదలు పెట్టారంటే ప్రతిపక్ష టీడీపీలో రేగే రాజకీయ దుమారం అంతా ఇంతా కాదనే విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు.

జంకూ గొంకూ లేకుండా అబద్ధాలు చెప్పే ‘పాథలాజికల్ లయ్యర్’ చంద్రబాబు అని ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు విజయసాయిరెడ్డి. టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు అంతిమ యాత్రలో బాబు ప్రవర్తనను తప్పుబట్టారు. ధర్మపోరాట దీక్ష అయినా, కోడెల అంతిమయాత్ర అయినా చంద్రబాబు ఆరాటం ఒకేలా ఉంటుందన్నారు. రాజకీయంగా ఎలా మైలేజీ పొందాలనే దానిపైనే బాబు ఆలోచనలు తిరుగుతూ ఉంటాయన్నారు. రాష్ట్రంలో 1.30 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తే.. పరీక్ష పేపర్ లీకైందంటూ డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. గ్రామ వాలంటీర్‌లను అవమానించే విధంగా ఆ ఉద్యోగాలను కొరియర్ ఉద్యోగాలని, రూ.5 వేల జీతంతో పెళ్లి సంబంధాలు కూడా రావన్నారని విజయసాయి విమర్శించారు. ఇప్పుడు మళ్లీ పేపర్ లీక్ అయిందంటూ పెడ బొబ్బలు పెడుతున్నారంటూ మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *