తెరపైకి మళ్లీ ప్రత్యేక హోదా.. అఖిలపక్ష భేటీలో వైసీపీ ఎంపీ..

మరోసారి తెరపైకి ప్రత్యేక హోదా అంశం వచ్చింది. గురువారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్షం సమావేశంలో భాగంగా వైసీపీ పలు అంశాలను లేవనెత్తారు. రాష్ట్రానికి సంబంధించి తొమ్మిది అంశాలను లేవనెత్తినట్లు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. రెవెన్యూ లోటు గ్రాంట్ కింద.. రాష్ట్రానికి రావాల్సిన రూ.18,969 కోట్ల బకాయిలు విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. అంతేకాకుండా.. వెనకబడిన జిల్లాలకు రూ. 23 వేల కోట్లు.. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 3,283 కోట్ల […]

తెరపైకి మళ్లీ ప్రత్యేక హోదా.. అఖిలపక్ష భేటీలో వైసీపీ ఎంపీ..
Follow us

| Edited By: Srinu

Updated on: Jan 30, 2020 | 7:25 PM

మరోసారి తెరపైకి ప్రత్యేక హోదా అంశం వచ్చింది. గురువారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్షం సమావేశంలో భాగంగా వైసీపీ పలు అంశాలను లేవనెత్తారు. రాష్ట్రానికి సంబంధించి తొమ్మిది అంశాలను లేవనెత్తినట్లు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. రెవెన్యూ లోటు గ్రాంట్ కింద.. రాష్ట్రానికి రావాల్సిన రూ.18,969 కోట్ల బకాయిలు విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. అంతేకాకుండా.. వెనకబడిన జిల్లాలకు రూ. 23 వేల కోట్లు.. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 3,283 కోట్ల రూపాయలను కేంద్రం రీయింబర్స్మెంట్ చేయాలని అడిగినట్లు చెప్పారు. అంతేకాకుండా.. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ. 55,548 కోట్లను ఆమోదించాలని… క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ గ్రాంట్ కింద రూ. 47,424 కోట్లు ఇవ్వాలని సమావేశంలో ప్రస్తావించామన్నారు. దుగ్గరాజపట్నం పోర్ట్‌కి బదులుగా రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని.. రాష్ట్రానికి పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు కల్పించాలని… అంతేకాకుండా.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.