లోకేష్ టీంతో నాకు ప్రాణహాని ఉంది: వైసీపీ ఎమ్మెల్యే

YCP MLA Rama Krishna Reddy to police: I have Life threat from team Lokesh, లోకేష్ టీంతో నాకు ప్రాణహాని ఉంది: వైసీపీ ఎమ్మెల్యే

ఏపీ రాజకీయాలకు అడ్డాగా సోషల్ మీడియా మరింత ఆజ్యం పోస్తుంది. ఒక పార్టీ నేతలు.. మరొక పార్టీ నేతలపై ఘాటుగా విమర్శలు చేసుకుంటారు. తాజాగా.. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు ఇంటిపై పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. ఈ సందర్భంగా.. కొందరు టీడీపీ అభిమానులు.. అధికారపక్షంపై మాటల యుద్ధానికి దిగారు. మీరంటే.. మీరని.. జోరుగా.. విమర్శలు సాగుతోన్నాయి. ఈ నేపథ్యంలో వీటిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు వైసీపీ ఎమ్మెల్యే.

ఏపీ మాజీ మంత్రి లోకేష్ టీంతో నాకు ప్రాణహాని ఉందని వైసీపీ ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పోలీసులకు పేర్కొన్నారు. వారిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని తాడేపల్లి పీఎస్‌‌లో ఆయన ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా నారా లోకేష్ టీం.. సీఎం జగన్‌పై.. తనపై ఫేస్‌బుక్‌లో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఆ పోస్టుల్లో బెదిరింపులు కూడా కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘మీ నాయకుడు జైలుకు పోవడం ఖాయం’.. ఆయనతో నువ్వు కూడా అంటూ అసభ్య పదజాలం వాడుతున్నారని ఆళ్ల పోలీసులకు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *