మా నాయకుడు జగన్ సాక్షిగా.. ఎమ్మెల్యే ప్రమాణం

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు జరిగిన విచిత్రమిది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మొదట నా ఆరాధ్య నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో నిబంధనల ప్రకారం వ్యక్తులపై ప్రమాణస్వీకారం చెల్లదన్న స్పీకర్ ఆయన చేత మరోసారి ప్రమాణం చేయించారు. కాగా, మొదటి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో అసెంబ్లీ సమావేశం ముగిసింది. 175 మందికి 174 మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. నరసారావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి […]

మా నాయకుడు జగన్ సాక్షిగా.. ఎమ్మెల్యే ప్రమాణం
Follow us

| Edited By:

Updated on: Jun 14, 2019 | 12:19 PM

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు జరిగిన విచిత్రమిది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మొదట నా ఆరాధ్య నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో నిబంధనల ప్రకారం వ్యక్తులపై ప్రమాణస్వీకారం చెల్లదన్న స్పీకర్ ఆయన చేత మరోసారి ప్రమాణం చేయించారు. కాగా, మొదటి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో అసెంబ్లీ సమావేశం ముగిసింది. 175 మందికి 174 మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. నరసారావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సమావేశానికి గైర్హాజరయ్యారు. నూతనంగా ఎంపికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు.