చినరాజప్ప ఎన్నిక చెల్లదు.. ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు

ఏపీ మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఎన్నిక చెల్లదంటూ కోర్టులో కేసు నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచిన చినరాజప్ప ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించారంటూ వైసీపీ నేత తోట వాణి పిటిషన్ దాఖలు చేశారు. చినరాజప్పపై 2007లో ఓబులాపురం గనుల కేసు ఉందని దాన్ని ఎన్నికల అఫిడవిట్‌లో చూపలేదని, ఈ కేసులో పలుమార్లు అరెస్టు వారెంటు కూడా జారీ అయ్యిందని ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా వస్తున్న పింఛన్ వివరాలు కూడా […]

చినరాజప్ప ఎన్నిక చెల్లదు.. ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు
Follow us

| Edited By:

Updated on: Jul 06, 2019 | 9:09 PM

ఏపీ మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఎన్నిక చెల్లదంటూ కోర్టులో కేసు నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచిన చినరాజప్ప ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించారంటూ వైసీపీ నేత తోట వాణి పిటిషన్ దాఖలు చేశారు. చినరాజప్పపై 2007లో ఓబులాపురం గనుల కేసు ఉందని దాన్ని ఎన్నికల అఫిడవిట్‌లో చూపలేదని, ఈ కేసులో పలుమార్లు అరెస్టు వారెంటు కూడా జారీ అయ్యిందని ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా వస్తున్న పింఛన్ వివరాలు కూడా వెల్లడించకుండా మోసం చేశారని ఆ పిటిషన్‌లో ఆరోపించారు. ఎన్నికల సంఘాన్ని కావాలని తప్పుదోవ పట్టించిన చినరాజప్ప ఎన్నిక చెల్లదంటూ తోట వాణి హైకోర్టును ఆశ్రయించారు.

మాజీ ఎంపీ తోట నరసింహం సతీమణి వాణి వైసీపీ అభ్యర్ధిగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో చినరాజప్పపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆమె నియోజకవర్గ ఇంచార్జ్‌గా బాధ్యతలు వహిస్తున్నారు.