Breaking News
  • ఏపీ అసెంబ్లీలో మహిళల భద్రతపై స్వల్పకాలిక చర్చ. మహిళల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు-హోంమంత్రి సుచరిత. మహిళల రక్షణ, సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. మహిళామిత్ర విభాగం ఏర్పాటు చేశాం. మహిళా కానిస్టుబుళ్లను నియమించాం. ఆత్మహత్యలు, ఒత్తిడి నిర్వహణ అంశాలపై కౌన్సెలింగ్‌. బాల్య వివాహాల నియంత్రణకు అవగాహన కల్పిస్తున్నాం-సుచరిత.
  • ప్రతి రైతుబజార్‌లో ఉల్లిని ప్రభుత్వం విక్రయిస్తోంది. పక్క రాష్ట్రాల నుంచి కూడా ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నాం. 36,536 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసి ప్రజలకు అందిస్తున్నాం. మేం రూ.25కే కిలో ఉల్లి ఇస్తే హెరిటేజ్‌లో రూ.200కు అమ్ముతున్నారు.
  • మహిళల భద్రతపై చర్చిస్తుంటే టీడీపీ అడ్డుకుంటోంది. ఉల్లిపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది-మంత్రి బుగ్గన. మహిళల పట్ల ప్రతిపక్షానికి బాధ్యతలేదు-మంత్రి బుగ్గన.
  • టీడీపీ ఎమ్మెల్యేలకు మహిళల భద్రత అవసరం లేదా-ఎమ్మెల్యే రజని. మహిళలు అభద్రతాభావంతో ఉన్నారు. మహిళల భద్రతపై మాట్లాడుతుంటే అడ్డుకుంటారా. మహిళల రక్షణపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు-ఎమ్మెల్యే రజని. మహిళలపై టీడీపీ నేతల నేరాలు బయటపడతాయనే చర్చను అడ్డుకుంటున్నారు. కాల్‌మనీ వ్యవహారంలో టీడీపీ నేతలకు సంబంధాలున్నాయి-ఎమ్మెల్యే రజని.
  • టీడీపీ సభ్యులపై స్పీకర్‌ తమ్మినేని ఆగ్రహం. ఉల్లి ధరలపై సీఎం చర్చిస్తామన్నారు. మహిళల భద్రతపై చర్చను అడ్డుకోవడం తగదు. చర్చకు సహకరించాలని కోరిన స్పీకర్‌ తమ్మినేని.
  • దిశ ఘటనతో మహిళలందరూ తల్లడిల్లిపోయారు-రోజా. సీఎం జగన్‌పై మహిళలందరికీ నమ్మకం ఉంది. మహిళలందరూ తమ గోడును జగన్‌కు చెప్పాలనుకుంటున్నారు. ఒక మహిళను హోంమంత్రి చేసిన ఘనత జగన్‌ది. హోంమంత్రి మాట్లాడుతుంటే టీడీపీ అడ్డుకుంటోంది. కాల్‌మనీ, లోకేష్‌ ఫొటోలు, బాలకృష్ణ వ్యాఖ్యలపై.. చర్చ జరుగుతుందేమోనని టీడీపీ అడ్డుకుంటోంది. మహిళలంటేనే టీడీపీ నేతలకు చులకన భావం. మహిళల భద్రతపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు-రోజా. దిశ ఘటన తర్వాత మహిళలు భయపడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా మహిళలకు వేధింపులు ఎక్కువయ్యాయి-రోజా. ఆంధ్రప్రదేశ్‌ అంటే ఆడవాళ్లప్రదేశ్‌గా మారాలి-రోజా. రేప్‌ చేసి చంపినప్పుడు గుర్తురాని మానవ హక్కులు.. ఎన్‌కౌంటర్‌ చేస్తే ఎందుకు గుర్తుకువస్తున్నాయి. దిశ కుటుంబసభ్యులను హెచ్‌ఆర్సీ ఎందుకు పరామర్శించలేదు-రోజా.
  • ఏపీ శాసనమండలిలో ఉల్లి ధరపై టీడీపీ వాయిదా తీర్మానం. మాతృభాషపై బీజేపీ వాయిదా తీర్మానం. వాయిదా తీర్మానాలను తిరస్కరించిన చైర్మన్‌. మండలిలో టీడీపీ సభ్యుల నిరసన.

రివర్స్ టెండరింగ్ బిగ్ హిట్..వాలంటీర్స్‌కు అదిరిపోయే ఫోన్లు

Andhra Pradesh: APTS saves Rs 83 crore in reverse tender, రివర్స్ టెండరింగ్ బిగ్ హిట్..వాలంటీర్స్‌కు అదిరిపోయే ఫోన్లు

ఏపీ సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ అంటూ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై మొదట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే సీఎం చేసిన ప్రయోగం ఊహించని విధంగా సక్సెస్ అయ్యంది. పోలవరం పలు ప్రాజెక్టుల్లో ఈ పద్దతిని అవలంభించిన ఏపీ సర్కార్..భారీగా నిధులను కాపాడుకుంది. దీంతో అన్ని గవర్నమెంట్‌కు సంబంధించిన ఒప్పందాల్లో ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు నాంది పలికింది.  తాజాగా స్మార్ట్‌ ఫోన్ల కొనుగోలులో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లి రూ. 83.8 కోట్లు ఆదా చేసింది ఏపీ సర్కార్. గ్రామ,వార్డు వాలంటీర్లకోసం 2,64,920 సెల్‌ఫోన్ల కోసం పలు కంపెనీలను టెండర్లకు ఆహ్వానించింది ప్రభుత్వం.

నవంబర్‌ 30న ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రభుత్వం తరుపున తొలిదశ బిడ్డింగ్‌‌కు ఆహ్వానించగా..రూ. 317.61 కోట్లకు ఓ కంపెనీ కోట్‌ చేసింది. దీనిపై మళ్లీ రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించగా ఈ సారి అదే కంపెనీ రూ.233.81 కోట్లకు కోట్‌ చేసి బిడ్‌‌ను దక్కించుకుంది. అంటే తొలిదశ బిడ్డింగ్‌ కన్నా రూ. 83.8 కోట్ల మేర తక్కువకు కోట్ చేసింది.  కాగా ఏపీ ప్రభుత్వం వాలంటీర్స్‌కు ఇచ్చే సెల్‌ఫోన్‌కు ఒక ఏడాది పాటు వారెంటీ, 3 జీబీ ర్యాం, 32 జీబీ మెమరీ, ఆక్టాకోర్‌ ప్రొసెసర్‌ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు మొబైల్‌ సాఫ్ట్‌వేర్‌ను కూడా అందించనున్నారు. మూడేళ్లపాటు మాస్టర్‌ డేటా మేనేజ్‌మెంట్, టైప్‌ ‘‘సి’’ లేదా మైక్రో యూఎస్‌బీ టూ మైక్రో యూఎస్‌బీ కన్వెర్టర్, టాంపర్డ్‌ గ్లాస్, బ్యాక్ కవర్, మూడు సంవత్సరాల వరకు మెయింటినెన్స్‌తో వాకిన్‌ సపోర్ట్‌ అందించనుంది బిడ్ దక్కించుకున్న కంపెనీ.