జంప్ జిలానీలపై యనమల సూపర్ కామెంట్.. ఏమన్నారంటే ?

టిడిపికి గతంలో ఎన్నడూ లేనంతగా వలసల బెంగ పట్టుకుంది. అధికారం కోల్పోయినప్పట్నించి రోజుకో లీడర్ పార్టీని వీడతారంటూ ప్రచారం.. అడపాదడపా కొందరు పార్టీని వీడిపోవడం గత అయిదు నెలలుగా షరా మామూలుగా మారింది. గత అయిదు నెలల్లో అతిపెద్ద ఝలక్ ఏంటంటే.. టిడపికి వున్న ఆరుగురు రాజ్యసభ సభ్యుల్లోంచి నలుగురు పార్టీని వీడిపోయి.. ఏకంగా తమదే అసలైన టిడిపి రాజ్యసభాపక్షం అంటూ బిజెపిలో విలీనం అయిపోవడం. అయితే ఇలాంటి ఉదంతాలను తన 42 ఏళ్ళ రాజకీయ జీవితంలో […]

జంప్ జిలానీలపై యనమల సూపర్ కామెంట్.. ఏమన్నారంటే ?
Follow us

|

Updated on: Nov 04, 2019 | 7:03 PM

టిడిపికి గతంలో ఎన్నడూ లేనంతగా వలసల బెంగ పట్టుకుంది. అధికారం కోల్పోయినప్పట్నించి రోజుకో లీడర్ పార్టీని వీడతారంటూ ప్రచారం.. అడపాదడపా కొందరు పార్టీని వీడిపోవడం గత అయిదు నెలలుగా షరా మామూలుగా మారింది. గత అయిదు నెలల్లో అతిపెద్ద ఝలక్ ఏంటంటే.. టిడపికి వున్న ఆరుగురు రాజ్యసభ సభ్యుల్లోంచి నలుగురు పార్టీని వీడిపోయి.. ఏకంగా తమదే అసలైన టిడిపి రాజ్యసభాపక్షం అంటూ బిజెపిలో విలీనం అయిపోవడం. అయితే ఇలాంటి ఉదంతాలను తన 42 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నింటినో చూసిన చంద్రబాబు ఈ వలసలపై ఆందోళన చెందకుండా తన పనేంటో తాను చేసుకుపోతున్నారు.
ఈనేపథ్యంలో పార్టీని వీడుతున్న టిడిపి నేతలపై ఆసక్తికరమైన కామెంట్ చేశారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. మొన్నటి మేలో జరిగిన ఎన్నికల్లో టిడిపి అనూహ్యంగా దారుణ ఓటమిని చవి చూసింది. మొత్తం 175 మంది సభ్యులున్న ఏపీ అసెంబ్లీలో కేవలం 23 సీట్లనే నిలబెట్టుకోగలిగింది. అయితేనేం.. ఆ ఎమ్మెల్యేలతోనే అయిదేళ్ళ విపక్షంలో గడిపి.. 2024 ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని పొందాలని ప్లాన్ చేశారు చంద్రబాబు. కానీ పరిస్థితి తారుమారైంది. అధికారం లేని చోట వుండలేకనో.. మరే ఇతర కారణమో తెలియదు కానీ.. టిడిపిని వీడేవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీని వీడనున్నట్లు ఓపెన్ లెటర్ రాశారు. ఆ తర్వాత ఆయన పత్తా లేకుండా పోయారు.
తాజాగా విశాఖ నగరానికి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు కూడా పార్టీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఏకంగా అధినేత చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలనే పట్టించుకోకుండా ధిక్కార ధోరణిని అవలంభించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సోమవారం చంద్రబాబు టిడిపి ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. టిడపి రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ రెండు భేటీల తర్వాత మాజీ మంత్రి, మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడారు. ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.
అధికారంలో వున్న పార్టీ వైపు రాజకీయ నాయకులు చూడడం అత్యంత పరిపాటి అని.. అందులో భాగంగానే కొందరు టిడిపి నేతలు సొంత లాభం కోసం పార్టీలు మారుతున్నారని యనమల కీలక కామెంట్లు చేశారు. నేతలు పార్టీలు మారడమనేది పెద్దగా పట్టించుకోనవసరం లేదని ఆయన అన్నారు. సొంత ప్రయోజనాలే ముఖ్యమనుకునే నేతలను ఎవరు ఏమి చేసినా ఆపలేరంటూ యనమల చేసిన కామెంట్లలో ఎవరి పేరును ప్రస్తావించకపోయినా.. తాజాగా జంప్ జిలానీలు వీరే అంటూ జరుగుతున్న ప్రచారంలో వినిపిస్తున్న నేతల నుద్దేశించే ఆయన వ్యాఖ్యలని చిన్న పిల్లాడైనా గుర్తించే పరిస్థితి వుంది. ఎంతైనా రాజకీయ కురువృద్దుడు కదా.. అందుకే సూటిగా పేర్లు ప్రస్తావించకుండానే చేయాల్సిన కామెంట్లు చేసేశారు యనమల.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!