భారీ గాలులకు మునిగిన పడవ.. ముగ్గురు పోలీసులు మిస్సింగ్..

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు గల్లంతయ్యారు. ప్రస్తుతం యూపీలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పకడ్బందీగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్న ముగ్గురు పోలీసులు.. సంగోలిపూర్‌ వద్ద యమునా నదిలో పడవ ప్రయాణం చేస్తున్నారు. ఈ సమయంలో భారీగా గాలులు వీయడంతో పడవ మునిగిపోయింది. దీంతో అందులో ఉన్న ముగ్గురు పోలీసులు నదిలో పడి గల్లంతయయారు. అయితే సమాచారం అందుకున్న కిషన్పూర్ పీఎస్‌కు చెందిన పోలీసులు రెస్క్యూటీంతో […]

భారీ గాలులకు మునిగిన పడవ.. ముగ్గురు పోలీసులు మిస్సింగ్..
Follow us

| Edited By:

Updated on: Apr 26, 2020 | 12:31 PM

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు గల్లంతయ్యారు. ప్రస్తుతం యూపీలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పకడ్బందీగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్న ముగ్గురు పోలీసులు.. సంగోలిపూర్‌ వద్ద యమునా నదిలో పడవ ప్రయాణం చేస్తున్నారు. ఈ సమయంలో భారీగా గాలులు వీయడంతో పడవ మునిగిపోయింది. దీంతో అందులో ఉన్న ముగ్గురు పోలీసులు నదిలో పడి గల్లంతయయారు. అయితే సమాచారం అందుకున్న కిషన్పూర్ పీఎస్‌కు చెందిన పోలీసులు రెస్క్యూటీంతో ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. అదే సమయంలో బలమై గాలులు ఓ వైపు వీస్తుండటంతో పాటుగా.. భారీగా వర్షం పడుతుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంగోలిపూర్ మడైయన్ ఘాట్ వద్ద యమునా నదిని దాటుతున్నప్పుడు ఈ పడవ దుర్ఘటన చోటు చేసుకుంది.

కాగా.. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఇప్పటికే 26వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యయి. వీరిలో 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక యూపీలో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. శనివారం ఒక్కరోజే వందకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే రాష్ట్రంలోని కొన్ని జిల్లాలు మాత్రం కరోనా మహమ్మారి నుంచి విముక్తి పొందాయి.