రైతు బిడ్డ ఆవేదన…చిన్న వయసులోనే ఆకాశమంత ఆలోచన?

చెరువులా మారిన పంట పొలాలు..పూర్తిగా జలమైన వ్యవసాయ క్షేత్రంలో ఓ రైతు బిడ్డ ఆవేదన...చిన్న వయసులోనే ఆకాశమంత ఆలోచనలతో తన గోడును వినిపించిన బడతడు.

రైతు బిడ్డ ఆవేదన...చిన్న వయసులోనే ఆకాశమంత ఆలోచన?
Follow us

|

Updated on: Sep 21, 2020 | 11:44 AM

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు చెరువులు, కుంటలు పొంగిపోర్లుతున్నాయి. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షానికి కొన్ని ప్రాంతాల్లో పంటపొలాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఈ క్రమంలోనే ఓ రైతుకు చెందిన ఆరెకరాల భూమి కూడా నడుము లోతు వరద నీటిలో మునిగిపోయి చెరువును తలపిస్తోంది. మరో 15 రోజుల్లో కోతలు పట్టాల్సి ఉండగా..తమ పొలం మునిగిపోవడంపై ఆ రైతు కుమారుడు అరుణ్ తన ఆవేదన వ్యక్తం చేశాడు.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అరూర్ గ్రామానికి చెందిన ఓ రైతు కొడుకు అరుణ్. తమ వ్యవసాయ పొలంలో నిండిపోయిన వరద నీటిలో ఈదుతూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. పూర్తిగా జలమయమైన ఆరు ఎకరాల పొలాన్ని చూపిస్తూ తన గోడు వెలిబుచ్చాడు. వ్యవసాయాన్ని నమ్ముకుని ఆరుగాలం శ్రమించి కష్టపడి అప్పులు చేసి మరీ పంట పండిస్తే తీరా పంట చేతికొచ్చే సమయానికి భారీ వర్షాలు, వరదలతో ఆరు ఎకరాల్లో వేసుకున్న పంట పూర్తిగా నీట మునిగిందని వాపోయాడు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని జిల్లా కలెక్టర్‌ను వేడుకున్నాడు. మరోసారి ఇలా కాకుండా చూడాలని కలెక్టర్‌ను వేడుకున్నాడు.

కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే