వ్యర్థాల నిర్వహణకు.. ‘ఏపీఈఎంసీ’ ఆన్‌లైన్ వేస్ట్‌ ఎక్సేంజ్‌ ఫ్లాట్‌ఫాం..

పారిశ్రామిక సంస్థలు ఏమాత్రం కష్టపడాల్సిన పనిలేకుండా.. తమ వద్ద ఉన్న వ్యర్థాల గురించి ఆన్‌లైన్‌లో నమోదుచేస్తే వాటిని తీసుకెళ్లి కాలుష్య రహితంగా ట్రీట్‌ చేసే ప్రణాళికను ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి

వ్యర్థాల నిర్వహణకు.. 'ఏపీఈఎంసీ' ఆన్‌లైన్ వేస్ట్‌ ఎక్సేంజ్‌ ఫ్లాట్‌ఫాం..
Follow us

| Edited By:

Updated on: Jun 05, 2020 | 2:42 PM

పారిశ్రామిక సంస్థలు ఏమాత్రం కష్టపడాల్సిన పనిలేకుండా.. తమ వద్ద ఉన్న వ్యర్థాల గురించి ఆన్‌లైన్‌లో నమోదుచేస్తే వాటిని తీసుకెళ్లి కాలుష్య రహితంగా ట్రీట్‌ చేసే ప్రణాళికను ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి సిద్ధం చేసింది. దీని కోసం దేశంలోనే మొదటిసారిగా ఆన్‌లైన్ వేస్ట్‌ ఎక్సేంజ్‌ ఫ్లాట్‌ఫాంను ఏపీలో ఏర్పాటు చేశారు. ఏపీ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్‌ ( ఏపీఈఎంసీ) ఫ్లాట్‌ఫాంని ముఖ్యమంత్రి జగన్‌ నేడు ప్రారంభించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ఏపీఈఎంసీ ప్రారంభమయింది.

పరిశ్రమల నుంచి వ్యర్థాల నిర్వహణ బాధ్యతలను ఇకపై ఏపీఈఎంసీ చేపట్టనుంది. వేస్ట్‌ ఎక్సేంజ్ నిర్వహణలో కచ్చితమైన ట్రాకింగ్, స్క్రూటినీ , ఆడిటింగ్‌ ప్రక్రియలు చేపట్టనున్నారు. వ్యవర్థాలను ప్రాసెస్‌ చేసే విధానాలకు ప్రోత్సాహమివ్వనున్నారు. కార్యక్రమంలో మంత్రులు గౌతంరెడ్డి, పిల్లిసుభాష్‌ చంద్రబోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, స్పెషల్‌ చీఫ్ ‌సెక్రటరీ ఫర్ ఎన్విరాన్‌మెంట్, నీరబ్‌కుమార్‌ ప్రసాద్, ఏపీపీసీబి మెంబర్‌ వివేక్‌యాదవ్‌ పాల్గొన్నారు.

Also Read: అంగన్‌వాడీల్లో ‘నాడు – నేడు’.. సీఎం జగన్ కీలక నిర్ణయం..