ఎమ్ ఐ బ్యాండ్ 4 ఫీచర్స్

The Mi Band 4 is coming to India next week., ఎమ్ ఐ బ్యాండ్ 4 ఫీచర్స్

షియోమి ఎమ్ ఐ బ్యాండ్ 4 ఇండియాలోకి రాబోతోంది. సెప్టెంబర్ 17న దీన్ని లాంచ్ చేయబోతున్నట్లు ట్వీట్ చేశారు కంపెనీ గ్లోబల్ వీపీ, ఇండియా ఎండి మను కుమార్ జైన్. ఐతే దీని ధర మాత్రం ఇంకా ప్రకటించలేదు. 2వేల రూపాయలకు పైనే ఉండొచ్చని తెలుస్తోంది. చైనాలో, ఎమ్ఐ బ్యాండ్ 4 ధర సిఎన్‌వై 169 (సుమారు రూ. 1,700) కాగా, ఎన్‌ఎఫ్‌సి వేరియంట్ ధర సిఎన్‌వై 229 (సుమారు రూ. 2,300).

ఎమ్ ఐ బ్యాండ్ 4 ఫీచర్స్ చూస్తే..

* 0.95 అంగుళాల కలర్ అమోలెడ్ డిస్ ప్లే
*120×240 పిక్సెల్స్ రిజల్యూషన్, 2.5 డి గ్లాస్ ప్రొటెక్షన్
*135 ఎమ్ హెచ్ బ్యాటరీ
*స్టెప్ కౌంట్, స్లీప్ కౌంట్, క్యాలరీ బర్నింగ్
*హార్ట్ రేట్ సెన్సార్
*ఫిట్ నెస్ ట్రాకర్ లో రకరకాల మోడ్స్
*ఎమ్ ఐ ఫిట్ యాప్ తో డిస్ ప్లేను ఛేంజ్ చేసుకోవచ్చు
*వాటర్ రెసిస్టెన్స్..స్విమ్మింగ్ చేస్తూ కూడా యూజ్ చేయొచ్చు
*ఆపరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది.
*వాయిస్ మెసేజెస్ ను పంపిస్తుంది.
*అలర్ట్ మెసేజెస్, ఇండికేషన్స్, స్టాప్ వాచ్
*70 కి పైగా వాచ్ ఫేసెస్

ఎమ్ ఐ బ్యాండ్ 3 తో పోలిస్తే సరికొత్తగా రాబోతోంది ఎమ్ ఐ బ్యాండ్ 4. స్మార్ట్ ఫోన్లో ఉన్న ఫీచర్స్ తో వస్తున్న ఈ ఎమ్ ఐ బ్యాండ్ 4 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు యూత్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *