ఎన్నాళ్లకెన్నాళ్లకు ? అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్ కు కంగ్రాట్స్ చెప్పిన చైనా అధినేత జిన్ పింగ్

ఎలాగైతేనేం ? అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్ కు చైనా అధినేత జీ జిన్ పింగ్ కంగ్రాట్స్ చెప్పారు. నిజానికి రెండు వారాల క్రితమే ఆయన శుభాకాంక్షలు చెప్పాల్సింది. కానీ ఎందుకో ఈ విషయంలో..

  • Umakanth Rao
  • Publish Date - 9:10 pm, Wed, 25 November 20

ఎలాగైతేనేం ? అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్ కు చైనా అధినేత జీ జిన్ పింగ్ కంగ్రాట్స్ చెప్పారు. నిజానికి రెండు వారాల క్రితమే ఆయన శుభాకాంక్షలు చెప్పాల్సింది. కానీ ఎందుకో ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించినట్టు కనిపిస్తోంది. అమెరికా, చైనా దేశాలు ఎలాంటి కయ్యాలకు దిగరాదని, పరస్పర గౌరవం, సహకారంతో మెలగాలని జిన్ పింగ్ తన సందేశంలో కోరారు. ప్రపంచ శాంతి, అభివృధ్దిని ప్రమోట్ చేసే మహత్తర కార్యానికి ఉభయ దేశాలూ కృషి చేయాలని ఆయన అన్నారు. ఇప్పటికైనా గతంలోని వివాదాలు ఏవైనా ఉంటే పరిష్కారమవుతాయని ఆశిస్తున్నట్టు జిన్ పింగ్ పేర్కొన్నారు.  ఇక చైనా వైస్ ప్రెసిడెంట్ వాంగ్ కిషాంగ్ కూడా తమ నేత బాటలో నడిచారు. జో బైడెన్ కి కంగ్రాట్స్ చెబుతూ.. చైనా, అమెరికా వివిధ రంగాల్లో మరింత సహకరించుకోగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.