సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ ఇకలేరు..

ప్రముఖ కవి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ కన్నుమూశారు. ఆయన వయస్సు 75 ఏళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఇంద్రగంటి భార్య జానకీబాల కూడా రచనారంగంలో స్థిరపడ్డారు. జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన రచయితగా స్థిరపడ్డారు. ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రంలో పనిచేశారు శ్రీకాంత్ శర్మ. తండ్రి మరణంతో ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ కన్నీరుమున్నీరవుతున్నారు. పలు కథలు, నాటకాలు, గేయాలు, సినీ గీతాలు శ్రీకాంత్ […]

సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ ఇకలేరు..
Follow us

| Edited By:

Updated on: Jul 25, 2019 | 10:41 AM

ప్రముఖ కవి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ కన్నుమూశారు. ఆయన వయస్సు 75 ఏళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఇంద్రగంటి భార్య జానకీబాల కూడా రచనారంగంలో స్థిరపడ్డారు. జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన రచయితగా స్థిరపడ్డారు. ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రంలో పనిచేశారు శ్రీకాంత్ శర్మ. తండ్రి మరణంతో ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ కన్నీరుమున్నీరవుతున్నారు. పలు కథలు, నాటకాలు, గేయాలు, సినీ గీతాలు శ్రీకాంత్ శర్మ రచించారు. కృష్ణావతారం, నెలవంక, రెండు జళ్ల సీత, పుత్తడిబొమ్మ వంటి సినిమాల్లో పాటలు రాశారు. మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సమ్మోహనం సినిమాలో మనసైనదేదో ఆయన చివరగా రాసిన పాట. ఆయన ఆత్మకథ ఇంటిపేరు ఇంద్రగంటి పాఠకాదరణ పొందింది. ఇవాళ సాయంత్రం అల్వాల్‌లోని స్వర్గధామ్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.