ఆ సమయంలో సీఆర్పీఎఫ్ జవాన్లే లేకపోతే..

లోక్‌సభ ఎన్నికల పోలింగ్ చివరి దశకు చేరుకున్న క్రమంలో పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్, బీజేపీల మధ్య మాటల యుద్ధం తీవ్రమైన హింసకు దారితీస్తోంది. ఇన్నిరోజులు ఒకరిపై మరొకరు పరోక్షంగా విమర్శలు కురిపించుకున్న నేతలు.. తమ స్థాయిని మరచి రెచ్చగొట్టే ప్రసంగాలకు పూనుకొన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం కోల్‌కతాలో అమిత్‌షా రోడ్ షో సందర్భంగా.. బీజేపీ, టీఎంసీ వర్గాల మధ్య హింస చెలరేగిన విషయం తెలిసిందే. దీనిపై ఉద్వేగంతో మాట్లాడిన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా.. ‘‘సీర్పీఎఫ్ జవాన్లే […]

ఆ సమయంలో సీఆర్పీఎఫ్ జవాన్లే లేకపోతే..
Follow us

| Edited By:

Updated on: May 15, 2019 | 3:46 PM

లోక్‌సభ ఎన్నికల పోలింగ్ చివరి దశకు చేరుకున్న క్రమంలో పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్, బీజేపీల మధ్య మాటల యుద్ధం తీవ్రమైన హింసకు దారితీస్తోంది. ఇన్నిరోజులు ఒకరిపై మరొకరు పరోక్షంగా విమర్శలు కురిపించుకున్న నేతలు.. తమ స్థాయిని మరచి రెచ్చగొట్టే ప్రసంగాలకు పూనుకొన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం కోల్‌కతాలో అమిత్‌షా రోడ్ షో సందర్భంగా.. బీజేపీ, టీఎంసీ వర్గాల మధ్య హింస చెలరేగిన విషయం తెలిసిందే. దీనిపై ఉద్వేగంతో మాట్లాడిన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా.. ‘‘సీర్పీఎఫ్ జవాన్లే లేకపోతే తాను గాయపడేవాడినేమోనంటూ ఒక దశలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హింస వెనుక మమత కుట్ర ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ హింస బెంగాల్‌లో టీఎంసీ పతనానికి నాంది అని ఆయన అన్నారు. మమత ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని.. మే 23 తరువాత దీదీ రోజులు ఉండవంటూ షా ఘాటుగా పేర్కొన్నారు. మీరు రాష్ట్రంలోని కేవలం 42స్థానాలకు మాత్రమే పోరాడుతున్నారని.. కానీ తమ పార్టీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పోరు సాగిస్తోందని అన్న ఆయన.. బెంగాల్‌లో మాత్రమే హింస జరుగుతుందంటే అది టీఎంసీ వల్లే అని ఆరోపించారు. పశ్చిమబెంగాల్‌లో మమతా ప్రజాస్వామాన్ని ఖూనీ చేశారని.. తన ర్యాలీకి వచ్చిన జనాదరణను చూసి తృణమూల్ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..