చావనైనా చస్తా.. కానీ.. బీజేపీకి మాత్రం…

తాను చావనైనా చస్తా కానీ.. బీజేపీకి మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ లబ్ధి చేకురే పనులు చేయనని ప్రియాంకా గాంధీ అన్నారు. ఒకవేళ అలాంటి పరిస్ధితి వస్తే.. ప్రాణత్యాగానికైనా సిద్ధమని వ్యాఖ్యానించారు. యూపీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయ్‌బరేలీలో పాల్గొన్న ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. తన ప్రచారం ద్వారా బీజేపీ ఓట్లు చీలుతాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ భావజాలం వినాశకరమైనదని అన్నారు. విపక్షాల ఓట్లను తాను చీలుస్తున్నానంటూ బీఎస్పీ అధినేత్రి […]

చావనైనా చస్తా.. కానీ.. బీజేపీకి మాత్రం...
Follow us

| Edited By:

Updated on: May 02, 2019 | 5:43 PM

తాను చావనైనా చస్తా కానీ.. బీజేపీకి మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ లబ్ధి చేకురే పనులు చేయనని ప్రియాంకా గాంధీ అన్నారు. ఒకవేళ అలాంటి పరిస్ధితి వస్తే.. ప్రాణత్యాగానికైనా సిద్ధమని వ్యాఖ్యానించారు. యూపీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయ్‌బరేలీలో పాల్గొన్న ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

తన ప్రచారం ద్వారా బీజేపీ ఓట్లు చీలుతాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ భావజాలం వినాశకరమైనదని అన్నారు. విపక్షాల ఓట్లను తాను చీలుస్తున్నానంటూ బీఎస్పీ అధినేత్రి మాయావతి చేసిన ఆరోపణల్లో నిజం లేదని.. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బీజేపీ ఓటును మాత్రమే చీలుస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోందని.. ఇది దేశంకోసం జరుగుతున్న పోరాటమని ఆమె అన్నారు.