ఫేక్ మెసేజ్‌లకు చెక్ పెట్టకపోయారో …

వాట్సాప్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఫేక్ మెసేజ్‌లు, సమాచారం స్ప్రెడ్ అవుతుండడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దేశ సార్వభౌమత్వాన్ని, వ్యక్తుల ప్రయివసీని కాపాడడం తప్పనిసరి అని, అదే సమయంలో అక్రమ కార్యకలాపాలకు కూడా చెక్ పెట్టి తీరాలని పేర్కొంది. ఇందుకు అనువుగా సిఫారసులు చేయాలంటూ కేంద్రానికి మూడు వారాల గడువును కోర్టు నిర్దేశించింది. తప్పుడు సమాచారాన్ని, సందేశాలను ఇచ్ఛే, లేదా పంపే వ్యక్తులను తప్పనిసరిగా గుర్తించాలి.. అదే సమయంలో […]

ఫేక్ మెసేజ్‌లకు చెక్ పెట్టకపోయారో ...
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 24, 2019 | 5:42 PM

వాట్సాప్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఫేక్ మెసేజ్‌లు, సమాచారం స్ప్రెడ్ అవుతుండడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దేశ సార్వభౌమత్వాన్ని, వ్యక్తుల ప్రయివసీని కాపాడడం తప్పనిసరి అని, అదే సమయంలో అక్రమ కార్యకలాపాలకు కూడా చెక్ పెట్టి తీరాలని పేర్కొంది. ఇందుకు అనువుగా సిఫారసులు చేయాలంటూ కేంద్రానికి మూడు వారాల గడువును కోర్టు నిర్దేశించింది. తప్పుడు సమాచారాన్ని, సందేశాలను ఇచ్ఛే, లేదా పంపే వ్యక్తులను తప్పనిసరిగా గుర్తించాలి.. అదే సమయంలో ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రజల ప్రయివసీని పరిరక్షించాల్సి ఉంది. మేము గానీ, హైకోర్టు న్యాయమూర్తులు గానీ దీనిపై నిర్ణయం తీసుకోజాలం.. ప్రభుత్వమే ఒక పాలసీతో ముందుకు రావాలి అని జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సూచించింది. తమను ఆధార్‌తో అనుసంధానించాలంటూ వఛ్చిన డిమాండుకు సంబంధించిన కేసులు మద్రాస్, బాంబే, మధ్యప్రదేశ్ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ప్రొఫైల్స్ ను ఒకరి ఆధార్ ఖాతాతో లింక్ చేయాలనే యోచన ఉందా అంటూ ఇదే బెంచ్ మూడు రోజుల క్రితమే కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ సందర్భంలో ఈ సమస్య ఆధార్ తో అనుసంధానం అన్నది కాదని, తప్పుడు వార్తలు, మెసేజులు ఎవరు పంపుతున్నారన్నది ముఖ్యమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి అనుచిత కార్యకలాపాలవల్లే సామూహిక దాడులు, వ్యక్తులను కొట్టి చంపడాల వంటి నేరాలు జరుగుతున్నాయని వారన్నారు. టెక్నాలజీ తప్పుడు దారిలో వెళ్తోంది.. నేను ఎ.కె.రైఫిల్ కొనాలంటే ‘ డార్క్ వెబ్ ‘ లోకి వెళ్ళి . .కేవలం అరగంటలో దాన్ని కొనే పరిస్థితి ఉంది ‘ అని జస్టిస్ గుప్తా పేర్కొన్నారు. ఈ దేశంలో శాస్త్రీయ విజ్ఞానం ఉన్న మాట నిజమే అయినా.. ఎన్ క్రిప్ట్‌కి అవకాశం ఉన్నప్పుడు డీక్రిప్ట్ చేసే టెక్నాలజీ కూడా ఉండాల్సిందే కదా అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ బ్యాలన్స్ ను మళ్ళీ తప్పనిసరిగా చూడాలని కోర్టు కేంద్రాన్ని హెచ్ఛరించింది. కాగా ఈ కేసులను బదిలీ చేయాలన్న అభ్యర్థనను తమిళనాడు ప్రభుత్వం నిరాకరిస్తూ.. ఫేస్‌బుక్ భారతీయ చట్టాలను పాటించడంలేదని, అందువల్ల ఫేక్ సమాచారాన్ని గుర్తించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొంది.

ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ఎన్నికల తర్వాత రీచార్జ్ చార్జీల బాదుడు..?
ఎన్నికల తర్వాత రీచార్జ్ చార్జీల బాదుడు..?
ఊరికే గ్రేట్ డైరెక్టర్ అవ్వరు మరి..!
ఊరికే గ్రేట్ డైరెక్టర్ అవ్వరు మరి..!
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా