Breaking News
  • భారత్ లో విజృంభిస్తున్న “కరోనా” వైరస్. 7 లక్షల 42 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య . గడచిన 24 గంటలలో అత్యధికంగా 22, 752 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. • గడచిన 24 గంటలలో దేశంలో “కరోనా” వల్ల మొత్తం 482 మంది మృతి • దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 7,42,417 • దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 2,64,944 • “కరోనా” కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,56,830 • “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 20,642 గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,62,679 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు ఇప్పటి వరకు దేశంలో 1,04,73,771 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు
  • మోడీ నాయకత్వంలో కోవిడ్ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కుంటుంది. పేద ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని వారిని పరిరక్షించుకుంటూనే, 5 ట్రిలియల్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది. గరీబ్ కళ్యాణ్ యోజన, గరీబ్ అన్న యోజన, గరీబ్ రోజ్ గార్ యోజన వంటి చర్యలు తీసుకొచ్చాము. వన్ నేషన్- వన్ మార్కెట్ , వన్ నేషన్- వన్ రేషన్ కార్డు వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది. దేశ సరిహద్దులను కాపాడుకుంటూనే, దేశంలోని సమస్యలకు మోడీ ప్రభుత్వం పరిష్కారం చూపిస్తుంది. కరోనా ను ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ, ఆ దిశలో రాష్ట్రం పని చేయడం లేదు ప్రభుత్వ తీరుపై బిజేపి ముందు నుంచి పోరాడుతుంది కరోనా మహమ్మారిపై కేంద్ర ముందు నుంచి హెచ్చరిస్తోంది కానీ తెలంగాణా ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం గా వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం పాటించాలి. ఐసిఎంఆర్ నిర్ణయాలను పొగడడమే కాదు, అమలు కూడా చేయాలి ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ సమర్ధవంతంగా చేయాలన్నదే మా డిమాండ్ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి అందిన విరళల దర్యాప్తుకు అంతర్ మంత్రిత్వ శాఖల కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర హోంశాఖ. మనిలాండరింగ్, ఐటి, తదితర చట్టాల ఉల్లంఘనలపై దర్యాప్తు చేయనున్న కమిటీ. ఈడీ ప్రత్యేక డైరెక్టర్ నేతృత్వంలో కమిటీ తన కార్యకలాపాలు నిర్వహించనుంది. మురళీధర్ రావు, బిజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి.
  • అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. కరోనా నేపథ్యంలో 13 జిల్లాల్లో స్పెషల్‌ సబ్‌జైళ్లు ఏర్పాటు. 13 ప్రత్యేక జైళ్లు ఏర్పాటుచేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. ఇకపై నేరస్తులందరినీ కోర్టు ఆదేశాల అనంతరం. స్పెషల్‌ జైలుకు తరలించే విధంగా ఆదేశాలు. కరోనా టెస్టులు, ఇతర శానిటైజేషన్ ప్రొటోకాల్ పాటించనున్న సబ్‌జైళ్లు. కరోనా నెగెటివ్‌ ఖైదీని మాత్రమే సాధారణ జైలుకు తరలించేలా ఆదేశాలు. జైలు సిబ్బందికి ప్రత్యేక రక్షణ కిట్లు.
  • జివికే గ్రూప్ ఫై ఈడి కేసు నమోదు . ముంబాయి ఎయిర్ పోర్ట్ అభివృధి పేరుతో 705 కోట్ల రూపాయల కుంభకోణం కు పాల్పడిన జీవీకే సంస్థ. మనీలాండరింగ్ కింద ఈడీ ఈసీఐఆర్ నమోదు . జి వి కృష్ణారెడ్డి, సంజీయిరెడ్డి లతో పాటు నిందితులకు ఈడీ నోటీసులు . 305 కోట్ల రూపాయల బదలాయియింపుల ఫై ఈడీ ఆరా . విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అనుమానాలు . జూన్ 27 న జీవీకే సంస్థ తో పాటు 13 మంది పై సీబీఐ కేసు నమోదు . గత వారంలో హైదరాబాద్ ,ముంబై లో నీ జీవీకే కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సిబిఐ.
  • పుదుచ్చేరి : కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి లోని గవర్నర్ భవన్ లో కరోనా కలకలం . గవర్నర్ బంగ్లా లో పనిచేసే సిబ్బంది ఒకరికి కరోనా నిర్ధారణ . గవర్నర్ కిరణ్ బేడీ తో సహా సిబ్బందికి కరోనా పరీక్షలు చేసిన వైద్యులు ,సిబ్బందిని ఖ్వారంటైన్ చేసి ,గవర్నర్ భవన్ ని సానిటీజెషన్ చేస్తున్న అధికారులు . రెండురోజుల పాటు గవర్నర్ భవన్ ని మూసివేస్తునట్టు ,గవర్నర్ కిరణ్ బేడీ ఆరోగ్యంగానే ఉన్నారని ప్రకటించిన అధికారులు.
  • చెన్నై : అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేత రాష్ట్ర మంత్రి తంగమనికి కరోనా నిర్ధారణ . మంత్రి తో పాటు మంత్రి కుమారుడికి కరోనా నిర్ధారణ ,చెన్నై అపోలో ఆస్పత్రి లో చికిత్స అందిస్తున్న వైద్యులు . తమిళనాడు లో ఇప్పటివరకు డీఎంకే , అన్నాడిఎంకె పార్టీలలో ఇద్దరు మంత్రులతో సహా 10 మంది ఎమ్మెల్యే లకు కరోనా నిర్ధారణ ,
  • నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ . నిమ్మగడ్డ రమేష్ పునర్ నియామకాన్ని సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం. మధ్యంతర ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు. ఎన్నికల నిర్వహణపై మాట్లాడుదలచుకోలేదన్న సీజేఐ ఎస్ఏ బొబ్డే. హైకోర్టు ఆదేశాలతో గతంలోని అధికారులు కూడా విధులు నిర్వర్తించలేకపోతున్నారన్న ఏపీ న్యాయవాది రాకేష్ ద్వివేది. మధ్యంతరంగా ఎస్ఈసీని నియమించేలా గవర్నర్ కు సూచించాలన్న ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది రాకేష్ ద్వివేది. ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది సూచనను తిరస్కరించిన సీజేఐ. గవర్నరకు ఇప్పుడు సూచన చేయలేమన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. 3 వారాల తర్వాత తుది వాదనలు వింటామన్న సీజేఐ ఎస్ ఏ బొబ్డే. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా.

అక్కడ మనుషులే కాదు.. పిల్లులు, కుక్కలుకు కూడా మాస్క్‌లు.. ఎందుకంటే..?

Worried cat owners are making felines wear masks for coronavirus protection, అక్కడ మనుషులే కాదు.. పిల్లులు, కుక్కలుకు కూడా మాస్క్‌లు.. ఎందుకంటే..?

ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వైరస్.. కరోనా. ఇది చైనాలో పుట్టి.. ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. దీనికి విరుగుడు మందు ఇంకా తయారు కాకపోవడంతో.. దీని బారిన పడిన వారు తిరిగి కోలుకోవడం కష్ఠంగా మారింది. ఇప్పటికే దాదాపు 1700మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడి మృత్యువాత పడ్డారు. మరో అరవై వేలకు పైగా మంది.. ఈ వైరస్ సోకి ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో వైరస్ బారిన పడకుండా.. అంతా పరిశుభ్రతను పాటిస్తున్నారు.ఇప్పటి వరకు శుభ్రతపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారంతా కూడా.. సానిటైజర్లు, ఫేస్‌ మాస్క్‌లు, హ్యాండ్‌ వాష్‌లంటూ శుభ్రతవైపు అడుగులేస్తున్నారు.

చైనాలోని వుహాన్‌లో పుట్టిన ఈ కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు.. ప్రపంచ దేశాల ప్రజలంతా అలర్ట్ అయ్యారు. ఇక చైనా వ్యాప్తంగా ప్రజల గురించి చెప్పక్కర్లేదు. అసలు ఇంట్లోనుంచి కాలు బయటపెట్టేందుకే గజగజవణికిపోతున్నారు. నిత్యం జనసంద్రంగా ఉండే వుహాన్ రోడ్లు బోసిపోయాయి. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావల్సి వస్తే.. ముఖాలకు మాస్క్‌లు తప్పనిసరి చేసింది అక్కడి ప్రభుత్వం. లేనిపక్షంలో వారంతా జైలు పాలవ్వాల్సిందే. అయితే అక్కడి ప్రజలు మాత్రమేకాదు.. ఇళ్లల్లో పెంచుకునే పెంపుడు జంతువులకు కూడా ఈ మాస్క్‌లు ధరిస్తున్నారు. పిల్లులు, కుక్కలకు కూడా మాస్క్‌లు ధరించి బయటకు తీసుకొస్తున్నారు. ఓ పిల్లి ఫేస్‌ మాస్క్‌తో రోడ్లపై తిరుగుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Tags