కరోనా ఉధృతి.. ప్రపంచ వ్యాప్తంగా 87 లక్షలకి చేరిన కేసులు

కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకీ వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య...

కరోనా ఉధృతి.. ప్రపంచ వ్యాప్తంగా 87 లక్షలకి చేరిన కేసులు
Follow us

| Edited By:

Updated on: Jun 20, 2020 | 10:12 AM

కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకీ వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 8765367కి చేరాయి. అలాగే మొత్తం మరణాల సంఖ్య నాలుగు లక్షలు దాటి.. 462681కి చేరింది. ఇక ప్రస్తుతం 3674852 యాక్టీవ్ కేసులు ఉండగా, రికవరీ కేసుల సంఖ్య 4627834 గా ఉంది.

ఇక అమెరికా, బ్రెజిల్‌లో కరోనా వైరస్ జోరు ఎక్కువగా కనిపిస్తుంది. ఒక్కోసారి జోరు బాగా తగ్గినట్లు కనిపిస్తున్నా.. మరోసారి బాగా పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం కొత్తగా 54,771 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 10,32,913కి చేరింది. అలాగే బ్రెజిల్‌లో 48,954 మంది కోవిడ్‌తో మృతి చెందారు. ఇక 5,07,000 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

అమెరికాలో కూడా కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రస్తుతం అక్కడ మొత్తం 22,97,190 కేసులు ఉన్నాయి. కోవిడ్‌తో మొత్తం 121407 మంది మరణించారు. ఇక ఓవరాల్‌గా చూస్తే రష్యా, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, టర్కీ దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇక చైనాలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది.

అలాగే భారత్ విషయానికి వస్తే.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. గ‌డిచిన‌ 24 గంటల్లో కొత్త‌గా 14,516 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,95,048కి చేరింది. కాగా క‌రోనా మ‌ర‌ణాలు సంఖ్య క‌ల‌వ‌ర‌పెడుతోంది. నిన్న ఒక్క‌రోజే 375 మంది కోవిడ్-19 కార‌ణంగా చనిపోయారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 12,948 కి చేరింది. కాగా వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన‌వారి సంఖ్య‌ 213831గా ఉంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 168269 ఉన్నాయి.