ప్రపంచంపై కరోనా పంజా.. 83 లక్షలకి చేరుకున్న కేసులు

కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకీ వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా బుధవారం కొత్తగా లక్షకి పైగా కేసులు రావడంతో..

ప్రపంచంపై కరోనా పంజా.. 83 లక్షలకి చేరుకున్న కేసులు
Follow us

| Edited By:

Updated on: Jun 18, 2020 | 9:55 AM

కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకీ వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా బుధవారం కొత్తగా లక్షకి పైగా కేసులు రావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 83,99,486కి చేరాయి. అలాగే మొత్తం మరణాల సంఖ్య నాలుగు లక్షలు దాటి.. 4,51,275కి చేరింది. ఇక ప్రస్తుతం 3538464 యాక్టీవ్ కేసులు ఉండగా, రికవరీ కేసుల సంఖ్య 4415785గా ఉంది.

ఇక అమెరికాలో మళ్లీ కరోనా జోరు కనిపిస్తుంది. ఒక్కోసారి జోరు బాగా తగ్గినట్లు కనిపిస్తున్నా.. మరోసారి బాగా పెరుగుతున్నాయి. తాజాగా బుధవారం కొత్తగా 26 వేలకి పైగా కేసులొచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 22.34 లక్షలకి చేరాయి. అలాగే నిన్న 809 మంది మరణించడంతో.. మొత్తం మరణాల సంఖ్య 119941కి చేరింది. ఇక ఓవరాల్‌గా చూస్తే బ్రెజిల్, రష్యా, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, టర్కీ దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇక చైనాలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. నిన్న తాజాగా 40 కేసులు నమోదయ్యాయి.

అలాగే భారత్ విషయానికి వస్తే.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. గ‌డిచిన‌ 24 గంటల్లో కొత్త‌గా 10,974 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,54,065కి చేరింది. కాగా క‌రోనా మ‌ర‌ణాలు సంఖ్య క‌ల‌వ‌ర‌పెడుతోంది. నిన్న ఒక్క‌రోజే 2003 మంది కోవిడ్-19 కార‌ణంగా చనిపోయారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 11,903కి చేరింది. డెత్ రేటు 2.9 శాతం నుంచి 3.4 శాతానికి పెరగడం గ‌మ‌నార్హం. కాగా వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన‌వారి సంఖ్య‌ 1,86,934గా ఉంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 1,55,227 ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ 4వ ప్లేసులో‌ ఉంది.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!