క్రీడాపోటీల్లోనే అతి పెద్దదైన ఒలంపిక్స్‌ని రద్దు చేస్తున్నారా?

విశ్వక్రీడ అయిన ఒలింపిక్స్‌ క్రీడాపోటీల్లోనే అతి పెద్దది. పతకం సాధించడం మాట అటుంచితే ప్రతి ఒక్క క్రీడాకారుడికి ఆ జగత్‌క్రీడలో పాల్లోనాలనే కోరిక ఉంటుంది. ఒలింపిక్స్‌లో పాల్గొనడమే పతకం సాధించినంత గొప్ప...

క్రీడాపోటీల్లోనే అతి పెద్దదైన ఒలంపిక్స్‌ని రద్దు చేస్తున్నారా?
Follow us

| Edited By:

Updated on: May 22, 2020 | 11:27 AM

విశ్వక్రీడ అయిన ఒలింపిక్స్‌ క్రీడాపోటీల్లోనే అతి పెద్దది. పతకం సాధించడం మాట అటుంచితే ప్రతి ఒక్క క్రీడాకారుడికి ఆ జగత్‌క్రీడలో పాల్లోనాలనే కోరిక ఉంటుంది. ఒలింపిక్స్‌లో పాల్గొనడమే పతకం సాధించినంత గొప్ప… నిజానికి జపాన్‌ రాజధాని టోక్యోలో ఆగస్టులో ఒలింపిక్స్‌ ప్రారంభం కావాలి. కాకపోతే కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో ఆ పోటీలను వాయిదా వేశారు. దీంతో జపాన్‌ ప్రభుత్వం వచ్చే ఏడాది జులైలో పోటీలను నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. మరి అప్పుడైనా జరిగే అవకాశం ఉందా? వాయిదా పడిన ఒలింపిక్స్‌ వచ్చే ఏడాది జులైతో నిర్వహించడం కుదరకపోతే మళ్లీ వాయిదా వేసే ప్రసక్తే ఉండదని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ చీఫ్‌ థామస్‌ బాచ్‌ చెప్పనే చెప్పాడు. 2021 వరకు కరోనా వైరస్‌ నియంత్రణలోకి రాకపోతే గేమ్స్‌ వాయిదాకు బదులు రద్దుకే మొగ్గు చూపుతామన్న జపాన్‌ ప్రభుత్వ నిర్ణయానికి తాను మద్దతిస్తున్నట్లు స్పష్టం చేశాడు. ఇప్పుడున్న పరిస్థితులలో ఒలింపిక్స్‌ వంటి అతి పెద్ద క్రీడాపోటీలను నిర్వహించడం దాదాపుగా అసాధ్యం. జపాన్‌ ఇందుకు మినహాయింపేమీ కాదు. ఒలింపిక్స్‌ ఏర్పాట్ల కోసం ప్రత్యేకంగా దాదాపుగా అయిదువేల మందికి ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమంటే మాటలు కాదు.. థామస్‌ బాచ్‌ భావన కూడా ఇదే… వాయిదా పడిన ప్రతీసారి క్రీడల షెడ్యూల్‌ మార్చడానికి కుదరదంటున్నాడాయన.

అప్పుడు ఇప్పుడు అంటూ అథ్లెట్లను అనిశ్చితిలో ఉంచకూడదన్నది ఆయన అభిప్రాయం. అందుకే వచ్చే ఏడాది నిర్వహణ సాధ్యం కాకపోతే ఒలింపిక్స్‌ రద్దుకే మొగ్గుచూపుతామని కరాఖండిగా చెప్పేశాడు. ఈ ఏడాది చివరికల్లా కరోనా ప్రభావం తగ్గకపోతే ఒలింపిక్స్‌ రద్దు చేస్తామని టోక్యో గేమ్స్ 2020 అధ్యక్షుడు యోషిరో మోరీ కూడా మొన్నామధ్య చెప్పాడు. అలాగని ఒలింపిక్స్‌ రద్దు అయితే ఎలా? అసలు ఇంతటి ప్రతిష్టాకరమైన టోర్నమెంట్‌ను రద్దు చేస్తారా? అనే దిగులే అక్కర్లేదు.. ఎందుకంటే ఒలింపిక్స్‌ రద్దు కావడం ఇది మొదలేమీ కాదు.. గతంలోనూ వేర్వేరు కారణాలతో ఒలింపిక్స్‌ రద్దయ్యాయి. ఆధునిక ఒలింపిక్స్‌లలో నాలుగోది. 1916 ఒలింపిక్స్‌కు జర్మనీ ఆతిథ్యమివ్వడానికి ముందుకొచ్చింది.. ఆ పోటీలకు బెర్లిన్‌లో జరగాల్సింది. బిడ్స్‌ సమయంలో ఈజిప్ట్‌, నెదర్లాండ్స్‌, బెల్జియం, హంగేరి, అమెరికాలను అధిగమించి జర్మనీ ఆ మహదావకాశాన్ని సంపాదించుకుంది.

అయితే 1914లో ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద్ధం కొనసాగుతూనే ఉండటంతో ఆ ఏడాది ఒలింపిక్స్‌ను అధికారులు రద్దు చేశారు. అప్పుడు ఛాన్స్‌ మిస్సయిన జర్మనీకి మళ్లీ 20 ఏళ్లకు కానీ అంటే 1936లో కానీ ఒలింపిక్స్‌ను నిర్వహించే అదృష్టం దక్కలేదు. ఇక పన్నెండో ఒలింపిక్స్‌ షెడ్యూల్‌ ప్రకారం జపాన్‌లోని టోక్యోలో 1940 సెప్టెంబర్‌ 21 నుంచి అక్టోబర్‌ ఆరు వరకు జరగాలి. అయితే రెండో ప్రపంచయుద్ధం భీకరంగా సాగుతున్నందున ఆ పోటీల వేదికను ఫిన్‌లాండ్‌లోని హెల్సింకికి మార్చారు. అక్కడ కూడా పోటీలను నిర్వహించే అవకాశాలు లేకపోవడంతో చివరకు టోర్నమెంట్‌ను రద్దు చేశారు. అదే ఏడాది జపాన్‌లో జరగాల్సిన వింటర్‌ ఒలింపిక్స్‌ కూడా రెండో ప్రపంచయుద్ధం కారణంగా రద్దయ్యింది. 1944లో లండన్‌లో జరగాల్సిన 15వ ఒలింపిక్స్‌ కూడా ఇదే పరిస్థితి.. రెండో ప్రపంచయుద్ధం ఆ పోటీలపై దెబ్బేసింది.

అయితే క్రీడాకారులు, క్రీడాభిమానులను ఉత్సాహపరచడానికి ఒలింపిక్స్‌ 15వ వార్షికోత్సవాన్ని ఐవోసీ గ్రాండ్‌గా నిర్వహించింది. ఆ ఏడాది నుంచే ఒలింపిక్‌ టార్చ్‌ రీలే ప్రారంభమైంది. అదే ఏడాదిలో ఇటలీలో జరగాల్సిన వింటర్‌ ఒలింపిక్స్‌ కూడా యుద్ధం కారణంగా రద్దయింది. ప్రపంచయుద్ధాలు ఒలింపిక్స్‌పై ప్రభావం చూపాయి సరే.. ఓ వైరస్‌ కారణంగా ఒలింపిక్స్‌ వాయిదా పడటం మాత్రం ఇదే ప్రథమం. ఇదే ఆఖరు కావాలని కోరుకుందాం. ప్రజల ప్రాణాల కంటే క్రీడలు గొప్పవేం కావు. అందరూ బాగున్నప్పుడు విశ్వ క్రీడలను ఘనంగా జరుపుకోవచ్చు.

బ్రేకింగ్: మరో మూడు నెలల మారటోరియం పెంచిన ఆర్బీఐ

మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?
ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?
నెటిజన్లను ఊరిస్తున్న బ్లూక‌ల‌ర్ ఘీ రైస్.. తయారీ వీడియో వైరల్
నెటిజన్లను ఊరిస్తున్న బ్లూక‌ల‌ర్ ఘీ రైస్.. తయారీ వీడియో వైరల్
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే
ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే
ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..
హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..
రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?
రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.