స్పేస్ హోటల్ గురూ.. 2025లో షురూ!

A Startup Wants To Launch A Space Hotel Named After A Nazi, స్పేస్ హోటల్ గురూ.. 2025లో షురూ!

త్రీ స్టార్.. ఫైవ్ స్టార్.. సెవెన్ స్టార్ హోటల్స్ లాంటివి ఇప్పటికే మనకు అందుబాటులో వచ్చాయి. స్వర్గాన్ని తలపించే హంగులతో స్వగతం పలుకుతాయి. వీటితో బోర్ కొట్టినవాళ్లకు సముద్రంలో హోటల్స్‌ను ఏర్పాటు చేశారు. అది కూడా ఓల్డ్ అయినట్లు ఉంది జనాలకు.. ఇప్పుడు ఏకంగా అంతరిక్షంలో ప్లాన్ చేస్తున్నారు.

స్వర్గాన్ని తలపించే హంగులతో అంతరిక్షంలో హోటల్‌ను నిర్మించేందుకు సిద్ధం అవుతున్నారు. కృతిమ గురుత్వాకర్షణ శక్తిని వినియోగించి ఈ హోటల్‌ను ఏర్పాటు చేయనున్నారని సమాచారం. గుండ్రటి ఆకారంలో ఉండే ఈ హోటల్‌లో 400 మంది అతిధులు పడతారట.

ఇక ఈ అంతరిక్ష హోటల్‌లో కూర్చుని విందు ఆరగిస్తూ.. ఎంచక్కా భూమిని చూస్తూ నిద్రలోకి జారుకోవచ్చని.. ఇందులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిర్వాహకులు చెబుతున్నారు. 2025లోపు ఈ హోటల్‌ను అందుబాటులోకి తీసుకొస్తారని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *