China – Corruption: కరప్షన్‌ను కేన్సర్‌తో పోల్చిన జిన్‌పింగ్.. సీపీసీ నేతలు, అధికారులకు సీరియస్ వార్నింగ్‌..!

China - Corruption: కరప్షన్‌ను కేన్సర్‌తో పోల్చారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌. చైనాలో అవినీతి ఇంకా తీవ్రంగానే ఉందని మండిపడ్డారు.

China - Corruption: కరప్షన్‌ను కేన్సర్‌తో పోల్చిన జిన్‌పింగ్.. సీపీసీ నేతలు, అధికారులకు సీరియస్ వార్నింగ్‌..!
Xi Jinping
Follow us

|

Updated on: Jun 19, 2022 | 5:57 AM

China – Corruption: కరప్షన్‌ను కేన్సర్‌తో పోల్చారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌. చైనాలో అవినీతి ఇంకా తీవ్రంగానే ఉందని మండిపడ్డారు. ‘‘అవినీతికి పాల్పడే దుస్సాహసం ఏ అధికారి చేయకూడదు. వాళ్లకి అసలు ఆ అవకాశం కానీ ఆలోచన కానీ రాకూడదు. ఆ విధంగా అవినీతి వ్యతిరేక పోరాటాన్ని బలోపేతం చేయాలి’’ అన్నారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌. అంతేకాదు, చైనా కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకులకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. అవినీతి జోలికి పోవద్దని, స్వీయ క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. చైనాలో అవినీతి ఇంకా తీవ్రంగానే ఉందంటూ దాన్ని కేన్సర్‌తో పోల్చారు. సీపీసీ పొలిటికల్‌ బ్యూరో ఓ గ్రూప్‌ స్టడీ సెషన్‌ను ఉద్దేశించి జిన్‌పింగ్‌ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు జిన్‌పింగ్‌. అవినీతి వ్యతిరేక పోరాటంలో సంపూర్ణ విజయం సాధించాలని చెప్పారు.

ముఖ్యంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు అత్యంత క్రమశిక్షణతో మెలగాలన్నారు. ముఖ్యంగా సీపీసీ సెంట్రల్‌ కమిటీలోని పొలిటికల్‌ బ్యూరో సభ్యులను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇది పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక విభాగం. జిన్‌పింగ్‌ 2012లో సీపీసీ జనరల్‌ సెక్రటరీ కాగానే అవినీతి వ్యతిరేక ఉద్యమం ప్రారంభించారు. ఆయన కీలక నిర్ణయాల్లో ఇదొకటిగా నిలిచింది. అయితే ఈ ఉద్యమాన్ని జిన్‌పింగ్‌ తన ప్రత్యర్థులను అణచివేయడానికి, అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారని తీవ్ర విమర్శలు వచ్చాయి. 2012 నుంచి పది లక్షల మందికి పైగా అధికారులను అవినీతి ఆరోపణలపై జైలుకి పంపించారు జిన్‌పింగ్‌. అయితే మళ్లీ అధికార పగ్గాలు చేపట్టాలని భావిస్తున్న ఆయన… అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని తీవ్రం చేయనున్నారని, అందుకే ఇప్పుడిలా గట్టి వార్నింగ్‌ ఇచ్చారని అంటున్నారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!