World Facts: ఆ దేశంలో లావుగా ఉండటం చట్ట విరుద్ధం.. శిక్షలు కూడా వేస్తారట.. అదెక్కడో తెలుసా?

ప్రపంచంలోని ఆయా దేశాలలో కొన్ని వింతైన, విచిత్రమైన చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు తెలిస్తే.. ఇది నిజంగానే అలా ఉందా అనే సందేహం రాకుండా మానదు.

World Facts: ఆ దేశంలో లావుగా ఉండటం చట్ట విరుద్ధం.. శిక్షలు కూడా వేస్తారట.. అదెక్కడో తెలుసా?
Faty
Follow us

|

Updated on: Nov 23, 2022 | 7:00 AM

ప్రపంచంలోని ఆయా దేశాలలో కొన్ని వింతైన, విచిత్రమైన చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు తెలిస్తే.. ఇది నిజంగానే అలా ఉందా అనే సందేహం రాకుండా మానదు. అలాంటి ఒక విచిత్రమైన చట్టం జపాన్‌లో ఉంది. ఇది చాలా విచిత్రమైనది. జపాన్ ప్రజలు ఎందుకు లావుగా కనిపించడం లేదని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? అంతెందుకు, అందరూ సన్నగానే ఎందుకు ఉంటారు? దీని వెనుక కారణం ఏంటి? అని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి కారణం జపాన్ చట్టం. ఈ చట్టం ఆ దేశ ప్రజలు లావుగా ఉండేందుకు అంగీకరించదు. జపాన్‌లో, అధిక శరీర బరువు కలిగి ఉండటం అంటే లావుగా ఉండటం చట్టవిరుద్ధం.

జపాన్ దేశంలోని ఈ వింత చట్టం కారణంగా.. ప్రపంచంలోనే అతి తక్కువ ఊబకాయం రేటు ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. చట్టంతో పాటు జపాన్ ప్రజల ఆహారం, అక్కడి రవాణా వ్యవస్థ కూడా ప్రజలు సన్నబడడంలో కొంతమేర పాత్ర పోషిస్తున్నాయి. ఇక్కడి ప్రజల ఆహారంలో చేపలు, కూరగాయలు, బియ్యం ఉన్నాయి. అంతే కాకుండా ప్రజా రవాణా కోసం ఎక్కువ దూరం నడవడం, నడక సంస్కృతి వల్ల ప్రజలు ఊబకాయం బారిన పడరు. జపాన్‌లో అమల్లో ఉన్న ఈ వింత చట్టం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఊబకాయం గురించి తీసుకొచ్చిన చట్టాన్ని ఏమంటారు?

జపాన్‌లో ఊబకాయం గురించి తీసుకొచ్చిన చట్టాన్ని ‘మెటాబో లా’ అంటారు. దీనిని జపాన్ ఆరోగ్య, కార్మిక మరియు సంక్షేమ మంత్రిత్వ శాఖ 2008లో ప్రవేశపెట్టింది. ఈ చట్టం ద్వారా, 40 నుంచి 74 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషులు, మహిళల నడుము వార్షిక కొలత తీసుకుంటారు. స్త్రీల నడుము పరిమాణం 33.5 అంగుళాలు పురుషులకు ఇది 35.4 అంగుళాలు ఉండాలి.

ఇవి కూడా చదవండి

జపాన్‌లో ఈ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారు?

జపాన్‌లో వృద్ధుల జనాభా ఎక్కువగా ఉన్నందున మెటాబో చట్టం తీసుకొచ్చారు. వీటన్నింటిని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఊబకాయం వల్ల ఎవరైనా మధుమేహం వంటి వ్యాధుల బారిన పడకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఇది జరిగితే, చికిత్సకు చాలా ఖర్చు అవుతుంది. అందుకే ఈ చట్టం తీసుకొచ్చారు.

లావుగా ఉన్నందుకు శిక్ష ఏంటి?

అయితే, జపాన్‌లో ఊబకాయానికి అధికారిక శిక్ష లేదు. దానికి బదిలు వేరే పనిష్మెంట్లు ఉన్నాయి. ఇవి ప్రజలను సన్నగా చేస్తాయి. ఎవరైనా లావుగా ఉంటే సన్నబడటానికి వెంటనే క్లాస్ తీసుకుంటారు. లావుగా ఉన్న వ్యక్తి పని చేసే సంస్థతో అతన్ని ఒంటరిగా వదిలేయండి, కొన్ని సామాజిక ఆంక్షలు ఉంటాయి. అది వారిని మానసికంగా ఒత్తిడిని పెంచుతాయి. ఫలితంగా.. వారు లావు కాకుండా సన్నగా ఉండేందుకు దోహదపడుతుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు