Hijab: హిజాబ్‌ ధరించలేదని యువతి అరెస్ట్‌.. రెండు రోజుల తర్వాత స్టేషన్‌లో మృతి.. అసలేం జరిగిందంటే..?

ఆడవాళ్ల దుస్తుల విషయంలో, మతాచారాలను పర్యవేక్షించే ‘మోరాలిటీ పోలీసులు’ మహ్సా అమినిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ జరిగిన తర్వాత మహ్సా అమినిని హింసించడంతో ఆమె చనిపోయిందని స్థానికులు పేర్కొంటున్నారు.

Hijab: హిజాబ్‌ ధరించలేదని యువతి అరెస్ట్‌.. రెండు రోజుల తర్వాత స్టేషన్‌లో మృతి.. అసలేం జరిగిందంటే..?
Iran Hijab Row
Follow us

|

Updated on: Sep 17, 2022 | 9:49 PM

Iran Hijab Row: హిజాబ్‌ కారణంగా ఇరాన్‌లో ఓ మహిళ చనిపోవడం తీవ్ర కలకలం రేపింది. కఠిన మత చట్టాలున్న ఇరాన్ దేశంలో మహిళలకు రక్షణ లేదని ప్రజల నుంచి నిరసనలు వెలువెత్తుతున్నాయి. హిజాబ్‌ సరిగ్గా ధరించలేదని కొద్దిరోజుల క్రితం మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆడవాళ్ల దుస్తుల విషయంలో, మతాచారాలను పర్యవేక్షించే ‘మోరాలిటీ పోలీసులు’ ఆమెను అరెస్ట్ చేశారు. అరెస్ట్ జరిగిన తర్వాత మహ్సా అమినిని తీవ్రంగా కొట్టారని.. దీంతో ఆమె చనిపోయిందని స్థానికులు మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. పలుచోట్ల పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు కూడా జరిగాయి. ఈ ఘటన ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో చోటుచేసుకుంది. దీనిపై అంతర్జాతీయంగా పలు హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్‌లో మానవహక్కులు, మహిళా హక్కుల విషయంలో ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

మహ్సా అమిని తన కుటుంబ సభ్యులతో టెహ్రాన్ సందర్శనలో ఉండగా.. ఆ దేశంలో మహిళల డ్రెస్ కోడ్ పర్యవేక్షించే పోలీసులు హిజాబ్ సరిగా ధరించలేదని ఆమెను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఆమెను కొడుతూ.. బలవంతంగా పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. స్టేషన్‌కు వచ్చాక సడెన్‌గా కుప్పకూలి ఆమె కోమాలోకి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. అయితే ఇందులో నిజం లేదని, పోలీసులు హింసించడంతోనే మహ్సా అమిని చనిపోయారని స్థానికులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

మహ్సా అమినికి న్యాయం చేయాలని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆమెను పోలీస్ స్టేషన్ నుంచి ఆస్పత్రికి తీసుకువచ్చే సమయంలో ఏం జరిగిందో తెలియదనేది తెలియడం లేదు. సోషల్ మీడియాలో ఈ వార్త హైలెట్ కావడంతో ఆస్పత్రి ముందు పెద్ద ఎత్తున ప్రజలు చేరారు. వీరందరిని పోలీసులు చెదరగొట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. న్యాయం కావాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మహ్సా అమినీ అనుమానాస్పద మరణంపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్పందించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఏకపక్షంగా పోలీసులు యువతిని అరెస్ట్ చేసి ఆమె మరణానికి కారణం అయ్యారని ఆరోపించింది. ఆమె తలపై గాయాలు ఉన్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. అయితే.. అరెస్ట్ అనంతరం ఆమె గుండెపోటుకు గురైనట్లు అధికారులు పేర్కొంటున్నారు.

కాగా.. దీనిపై ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ స్పందించారు. అమినీ కేసుపై విచారణ ప్రారంభించాలని అంతర్గత మంత్రిని ఆదేశించారు. ఇటీవల కాలంలో ఇరాన్ లో మానవ హక్కుల ఉల్లంఘనలు ఎక్కువ అవుతున్నాయని పలు అంతర్జాతీయ హక్కుల సంస్థలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..