జపాన్ ను భయపెడుతున్న ‘ఓర్ ఫిష్’

జపాన్ లో ఇటీవల సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లకు మూడు నుంచి నాలుగు మీటర్ల పొడవున్న రెండు చేపలు చిక్కాయి. అయితే, అవి సాధారణ చేపలు కావు. సముద్ర గర్భంలో మాత్రమే జీవించే అరుదైన ఓర్‌ఫిష్ చేపలు. సముద్రానికి అత్యంత లోతులో జీవించే ఈ చేపలు ఉపరితలానికి వస్తే ఉపద్రవం తప్పదని జపాన్ పురాణాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో జపాన్‌‌లో భారీ భూకంపాలు, సునామీలు సంభవించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. జాలర్లు పట్టుకున్న ఈ […]

జపాన్ ను భయపెడుతున్న 'ఓర్ ఫిష్'
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 08, 2020 | 8:21 PM

జపాన్ లో ఇటీవల సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లకు మూడు నుంచి నాలుగు మీటర్ల పొడవున్న రెండు చేపలు చిక్కాయి. అయితే, అవి సాధారణ చేపలు కావు. సముద్ర గర్భంలో మాత్రమే జీవించే అరుదైన ఓర్‌ఫిష్ చేపలు. సముద్రానికి అత్యంత లోతులో జీవించే ఈ చేపలు ఉపరితలానికి వస్తే ఉపద్రవం తప్పదని జపాన్ పురాణాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో జపాన్‌‌లో భారీ భూకంపాలు, సునామీలు సంభవించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

జాలర్లు పట్టుకున్న ఈ చేపలు బ్రతికే ఉన్నాయి. అయితే, కొద్ది రోజుల కిందట ఈ జాతికే చెందిన ఓర్‌ఫిష్‌లు చనిపోయి సముద్రంపై తేలియాడతూ కనిపించాయి. అవి ఇప్పుడు దొరికిన చేపలు కంటే చాలా పెద్దవి. వాటి పొడవు సుమారు 11 మీటర్ల పైనే ఉంటుంది. 2011లో భూకంపం, సునామీలు జపాన్‌లోని ఫుకుషిమాలో సుమారు 20వేల మందికి పైగా ప్రజలను పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ విపత్తుకు ముందు 2010లో డజన్ల కొద్ది ఓర్‌ఫిష్‌లు సముద్ర తీరానికి కొట్టుకొచ్చాయి. దీంతో జపాన్ ప్రజలు ఈ విషయాన్ని గట్టిగా నమ్ముతున్నారు.