WHO: కరోనా తర్వాత మానసిక రుగ్మతలు పెరిగాయి.. ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్ఓ

కరోనా కారణంగా మానసిక రుగ్మతలు అనూహ్యంగా పెరిగాయని డబ్ల్యూహెచ్ఓ(WHO) ఆందోళన వ్యక్తం చేసింది. నిరాశ, ఆందోళన 25% పెరిగాయని వెల్లడించింది. తద్వారా ఆత్మహత్యల సంఖ్య పెరుగుతోందని హెచ్చరించింది. ప్రపంచ మానసిక ఆరోగ్యంపై ప్రపంచ...

WHO: కరోనా తర్వాత మానసిక రుగ్మతలు పెరిగాయి.. ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్ఓ
Mental Health
Ganesh Mudavath

| Edited By: Ravi Kiran

Jul 06, 2022 | 2:45 PM

కరోనా కారణంగా మానసిక రుగ్మతలు అనూహ్యంగా పెరిగాయని డబ్ల్యూహెచ్ఓ(WHO) ఆందోళన వ్యక్తం చేసింది. నిరాశ, ఆందోళన 25% పెరిగాయని వెల్లడించింది. తద్వారా ఆత్మహత్యల సంఖ్య పెరుగుతోందని హెచ్చరించింది. ప్రపంచ మానసిక ఆరోగ్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సమీక్షలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. 2019లో దాదాపు ఒక బిలియన్ మంది ప్రజలు మానసిక రుగ్మతతో (Mental Health) బాధపడుతున్నారు. ముంబయికి చెందిన మానసిక వైద్యుడు శుభ్రనీల్ మిత్రా మాట్లాడుతూ గత రెండేళ్లుగా ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, ఇలా సూసైడ్ చేసుకుంటున్న వారి వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉందని చెప్పారు. చిన్నతనంలో ఎదురయ్యే లైంగిక వేధింపులు, బెదిరింపులు మానసిక సమస్యలకు ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. సామాజిక, ఆర్థిక అసమానతలు, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులు, యుద్ధం, వాతావరణ సంక్షోభం వంటివి మరిన్ని కారణాలుగా చెప్పవచ్చు. అయితే కరోనా(Corona) మహమ్మారి వచ్చిన మొదటి సంవత్సరంలోనే డిప్రెషన్, ఆందోళన 25 శాతానికి పైగా పెరిగడం గమనార్హం.

చాలా మంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. దీంతో వారిలో మానసిక అసమానతలు తలెత్తాయి. దాదాపు 27 శాతం మంది ఆత్మహత్య ఆలోచనలు చేస్తున్నారు. మానసిక ఆరోగ్య పరిస్థితులు ఉన్న వ్యక్తులపై వివక్ష, మానవ హక్కుల ఉల్లంఘనలు ప్రతిచోటా జరుగుతూనే ఉంది. 20 దేశాలు ఇప్పటికీ ఆత్మహత్యాయత్నాన్ని నేరంగా పరిగణిస్తున్నాయి. సమాజంలో అత్యంత పేద, వెనుకబడిన వర్గాల వారు మానసిక అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. కరోనా మహమ్మారికి ముందు కూడా, అవసరమైన వ్యక్తుల్లో కొద్ది మంది మాత్రమే సమర్థవంతమైన, నాణ్యమైన మానసిక ఆరోగ్య సంరక్షణను పొందారు. ఉదాహరణకు ప్రపంచవ్యాప్తంగా సైకోసిస్ తో బాధ పడుతున్న వారిలో 71 శాతం మందికి మానసిక ఆరోగ్య సేవలు అందడం లేదు. కేవలం 12 శాతం మంది మాత్రమే మానసిక ఆరోగ్య సంరక్షణను పొందుతున్నారు. మిగతా వారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.

అధిక ఆదాయ దేశాల్లో కూడా డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తుల్లో మూడింట ఒక వంతు మంది మాత్రమే మానసిక ఆరోగ్య సంరక్షణను పొందుతున్నారు. డబ్ల్యూహెచ్ఓ సమగ్ర నివేదిక ప్రకారం మానసిక ఆరోగ్యానికి అధిక విలువ ఇచ్చింది. ఇది నిబద్ధతను మరింతగా పెంచడానికి, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే పరిస్థితులను కల్పించడానికి, ప్రజల మానసిక ఆరోగ్యానికి శ్రద్ధ వహించే వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఊతం ఇచ్చినట్లయింది. మానసిక ఆరోగ్యానికి గురయిన వారికి అవినాభావ సంబంధాలు, మానవ హక్కులు వంటి ముఖ్యమైన ప్రయోజనాలను అందించేందుకు తోడ్పడాలని WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ అన్నారు.

మొత్తం 194 సభ్యదేశాలు సమగ్ర మానసిక ఆరోగ్య కార్యాచరణ ప్రణాళిక 2013–2030 పై సంతకం చేశాయి. ఇది మానసిక ఆరోగ్యాన్ని మార్చడానికి ప్రపంచ లక్ష్యాలకు కట్టుబడి ఉంటుంది. గత దశాబ్దంలో సాధించిన ప్రగతి.. మార్పు సాధ్యమేనని రుజువు చేస్తున్నాయి. కానీ మార్పు తగినంత వేగంగా జరగడం లేదు. దశాబ్దాలుగా మానసిక ఆరోగ్యం అనేది ప్రజారోగ్య అత్యంత విస్మరించిన అంశాల్లో ఒకటిగా ఉంది. ప్రతి దేశం తన జనాభాకు మెరుగైన మానసిక ఆరోగ్యం వైపు అర్థవంతమైన పురోగతిని సాధించడానికి పుష్కలమైన అవకాశాలను కలిగి ఉంటుంది. మానసిక ఆరోగ్యానికి వైఖరులను మార్చడం, మానసిక ఆరోగ్యానికి ప్రమాదాలను పరిష్కరించడం, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడంపై దృష్టి సారించే మూడు వర్గాలుగా నిపుణులు వర్గీకరించారు.

సమాజంలోని అన్ని అంశాలలో మానసిక ఆరోగ్య పరిస్థితులు ఉన్న వ్యక్తులతో సహా వివక్షను అధిగమించడానికి, అసమానతలను తగ్గించడానికి, సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడానికి నిర్ణయం తీసుకోవాలి. ఇళ్లు, పాఠశాలలు, కార్యాలయాలు, ఆరోగ్య సంరక్షణ సేవలు, సహజ వాతావరణాలతో సహా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే వాతావరణాలను పునర్నిర్మించాలి. అలా చేయడం ద్వారా మానసిక ఆరోగ్యంతో బాధపడేవారికి కొంతైనా సహాయం చేయవచ్చు. మానసిక ఆరోగ్య పరిస్థితులు ఉన్న వ్యక్తులకు జీవనోపాధిని అందించడం, పాఠశాలల్లో బెదిరింపులను ఎదుర్కొనేటప్పుడు సామాజిక, భావోద్వేగ అభ్యాస కార్యక్రమాలను ప్రవేశపెట్టడం వంటివి చేయడం ద్వారా వారికి తామున్నామన్న భరోసా కల్పించవచ్చు. డిప్రెషన్, ఆందోళన వంటి సాధారణ మానసిక ఆరోగ్య పరిస్థితుల కోసం సంరక్షణ చర్యలు చేపట్టాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu