Facebook: అబద్ధాలు చెప్పి స్కూల్‌కు లీవ్ పెట్టిన టీచర్.. బెడ్‌ రూమ్‌లో అతనితో.. అడ్డంగా బుక్ చేసిన ఫేస్‌బుక్..

Facebook: ప్రస్తుత కాలంలో అబద్ధాలు అనేది కామన్ అయిపోయింది. జనాలు తమ అవసరానికి అనేక అబద్ధాలు చెబుతున్నారు.

Facebook: అబద్ధాలు చెప్పి స్కూల్‌కు లీవ్ పెట్టిన టీచర్.. బెడ్‌ రూమ్‌లో అతనితో.. అడ్డంగా బుక్ చేసిన ఫేస్‌బుక్..
Facebook
Follow us

|

Updated on: Nov 25, 2021 | 6:22 AM

Facebook: ప్రస్తుత కాలంలో అబద్ధాలు అనేది కామన్ అయిపోయింది. జనాలు తమ అవసరానికి అనేక అబద్ధాలు చెబుతున్నారు. పనిచేసే సంస్థల్లో సెవలు కోసమో, పాఠశాల, కాలేజీలో సెలవు కోసమే ప్రతీ చోట ఏదో ఒక అబద్ధం చెప్పే ఉంటారు. అయితే, అబద్ధం చెప్పి కొందరు సేఫ్ అయితే, మరికొందరు అడ్డంగా బుక్కైన దాఖలాలు కూడా ఉన్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఓ పంతులమ్మ ఫేస్ చేసింది. వేల్స్ దేశంలో ఒక మహిళా టీచర్ విషయంలో కూడా అలాంటిదే జరిగింది. ఇప్పుడు ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఫేస్‌బుక్ ఆ మహిళ చెప్పిన అబద్ధాన్ని రట్టు చేసింది. ఆమె అఫైర్‌ను బట్టబయలు చేసింది.

ఓ మహిళా టీచర్ స్కూల్ హెడ్ మాస్టర్ కు అబద్ధాలు చెప్పి కొద్ది రోజులు సెలవు తీసుకుంది. ఇంట్లో పరిస్థితులు బాగోలేదని, ఆరోగ్యం సరిగా లేదనే కుంటిసాకులు చెప్పి.. సెలవు కావాలని కోరింది. దాంతో స్కూల్ యాజమాన్యం ఆమెకు సెలవు వచ్చింది. కానీ, అబద్ధాలు చెప్పి తీసుకున్న ఆ సెలవులను మరో రకంగా ఉపయోగించుకుంది మహిళా టీచర్. ఆమె తన ప్రియుడితో కలిసి రోమ్‌ని సందర్శించడానికి వెళ్ళింది. తన ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో ఆమె అబద్ధం బయటపడింది.

మహిళా టీచర్ పేరు ఎల్లా గ్రిఫిత్(25). ఇప్పుడు ఆమె అబద్ధాలు చెప్పినట్లు తేలడంతో.. స్కూల్ యాజమాన్యం షాక్ అయ్యింది. పాస్తా తింటూ, కాక్‌టెయిల్‌లు సిప్ చేస్తూ, హాట్ టబ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. అయితే, అత్యవసరం సమయంలో అబద్ధాలు చెప్పి సెలవులు తీసుకున్నందుకు ఆమెపై చర్యలు తీసుకుంటామని స్కూల్ యాజమాన్యం తెలిపింది.

అధికారిక సమాచారం ప్రకారం.. ఎల్లా గ్రిఫిత్ హోలీహెడ్ టౌన్‌లోని యెస్గోల్ సైబీ స్కూల్‌లో అసిస్టెంట్ టీచర్‌గా పని చేస్తోంది. అయితే, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ర్యాన్ గ్రీవ్.. ఎల్లా పాఠశాలకు తిరిగి వచ్చిన తర్వాత ఆమె గైర్హాజరుకు సంబంధించి నిజాలు చెప్పాలని కోరాడు. తన భాగస్వామితో కలిసి ఇటలీకి వెళ్లినట్లు స్పష్టం చేసింది. కొద్ది రోజులు అక్కడే ఉన్నానని అంగీకరించింది. సెలవు కోసం అబద్ధాలు చెప్పినట్లు ఒప్పుకుంది. ప్రస్తుతం ఎడ్యూకేషన్ టాస్క్‌ఫోర్స్ కౌన్సిల్‌లో ఎల్లా పై విచారణ జరుగుతోంది. వృత్తిపరంగా ఆమె దోషి అని తేలితే.. టీచింగ్ లైసెన్స్‌ను పూర్తిగా క్యాన్సల్ చేస్తారు. అలా చేస్తే.. ఎల్లా ఇకమీదట ఏ స్కూల్‌లోనూ పని చేయడానికి లేదు.

Also Read:

Rashmi Gautam: ఒంపు సొంపులతో పిచ్చెక్కిస్తున్న జబర్దస్త్ బ్యూటీ..

Aaradhya : ఐశ్వర్య ఆరాధ్య చేతిని వదిలేయి.. మరోసారి ట్రోలర్ల బారిన పడ్డ తల్లీకూతుళ్లు..

Shamna Kasim: కనువిందు చేసే అందంతో ఫాన్స్‌ని కట్టిపడేస్తున్న `ఢీ` పూర్ణ..