VIRAL NEWS: సెకండ్ హ్యాండ్ సోఫా కొన్నారు.. అసలు విషయం తెలిసి కంగుతిన్నారు.. వైరల్ గా మారిన పోస్ట్

సాధారణంగా మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో సెకండ్ హ్యాండ్ వస్తువులను కొనుగోలు చేస్తాం. ధర తక్కువగా ఉండటం, ఆకర్షణీయంగా ఉండటంతో వాటిని కొంటూ ఉంటాం. వస్తువు గురించి తెలిసిన వాళ్లను వివరాలు అడిగి మరీ ముందుకెళ్తాం.

VIRAL NEWS: సెకండ్ హ్యాండ్ సోఫా కొన్నారు.. అసలు విషయం తెలిసి కంగుతిన్నారు.. వైరల్ గా మారిన పోస్ట్
Sofa Shopping
Follow us

|

Updated on: Feb 06, 2022 | 11:00 AM

సాధారణంగా మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో సెకండ్ హ్యాండ్ వస్తువులను కొనుగోలు చేస్తాం. ధర తక్కువగా ఉండటం, ఆకర్షణీయంగా ఉండటంతో వాటిని కొంటూ ఉంటాం. వస్తువు గురించి తెలిసిన వాళ్లను వివరాలు అడిగి మరీ ముందుకెళ్తాం. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా వస్తువును కొని ఇంటికి తీసుకెళ్లాక కొన్ని సార్లు ఇబ్బంది పడుతుంటాం. బ్రిటన్‌‌కు చెందిన జెస్‌ లూయీస్‌ కు ఇటువంటి పరిస్థితే ఎదురైంది. ఇలా జరుగుతుందని తాను అస్సలు ఊహించలేదంటూ తన అనుభవాన్ని ఫేస్‌బుక్‌ వేదికగా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. జెస్ తన స్నేహితుడితో కలిసి ఉత్తర ఐర్లాండ్‌లోని కో-ఆంట్రిమ్‌ అనే ప్రాంతంలో నివసిస్తోంది. ఆమె ఇంట్లో ఉన్న సోఫా విరిగిపోవడంతో వేరే సోఫా కొనాలని నిర్ణయించుకుంది. అప్పటికే తన ఇంట్లో రెండు కుక్కలు ఉండటం, ఖరీదైన సోఫా కొంటే వాటిని అవి పాడు చేస్తాయోమోనన్న భయంతో సెకండ్ హ్యాండ్ లో కొనేందుకు నిర్ణయించుకున్నారు.

సోఫా కొనే ప్రయత్నంలో ఉండగా.. ఓ సోఫా ఆమె దృష్టిని ఆకర్షించింది. చూడటానికి శుభ్రంగా ఉండటం, ఎటువంటి దుర్వాసనా లేకపోవడంతో జెస్ వెంటనే దాన్ని కొనుగోలు చేసింది. ఓ రోజు ఆ జంట సోఫాలో కూర్చుని టీవీ చూస్తుండగా జెస్ స్నేహితుడు. టీవీ రిమోట్‌ను సోఫాలో పక్కన పెట్టాడు. అది అక్కడ ఉన్న చిన్న గ్యాప్‌లో ఇరుక్కుపోయింది. దాన్ని తీసేందుకు ప్రయత్నించగా.. అది సోఫా అడుగుకు జారీ పోయింది. రిమోట్ బయటకు తీసే క్రమంలో సోఫా సీట్లను పక్కకు తొలగించగా.. జుగుప్సాకరమైన దృశ్యం కనిపించింది. అక్కడ వేల సంఖ్యలో చేయి, కాలి వేళ్ల గోర్లు కనిపించాయి. దీంతో వారు అవాక్కయ్యారు. ఎన్నో ఏళ్ల పాటు కత్తిరించిన గోళ్లను బయటపడేయకుండా ఎవరో ఇలా సోఫా అడుగున దాచి పెట్టారని అర్థమై ఆ జంట ఆగ్రహానికి గురయ్యారు. గోళ్లతో పాటు ఇతర చెత్తా చెదారంతో సోఫా నిండిపోయింది. ఈ విషయాల్ని సోషల్ మీడియాలో పంచుకున్న జెస్.. సెకెండ్ హ్యాండ్ వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ సూచించింది. ఇక జెస్ పోస్ట్‌ను చూసినవారందరూ ఇదే విధంగా కామెంట్లు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read

Lata Mangeshkar: గానకోకిలకు బాలీవుడ్ సెలబ్రెటీల నివాళి.. గుండె బద్దలయ్యిందంటూ ట్వీట్స్.

Abu Dhabi: లక్ తెచ్చిన లాటరీ టికెట్.. లక్కీడ్రాలో 44 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకున్న కేరళ యువతి.. 

5G Services: 5జీ సేవలతో విమానాలకు ప్రమాదం ఉంటుందా..? పార్లమెంట్‌లో కేంద్రం సమాధానం

అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.