Pakistan: పాకిస్థాన్ లో చెలరేగిన హింస..భారత సిక్కు యాత్రీకుల పర్యటనకు ఇబ్బందులు

పాకిస్థాన్ లోని పలు నగరాల్లో భారీ హింస చెలరేగింది. ఫ్రాన్స్ ల్లో దైవదూషణపై వ్యంగ్య చిత్రాలను ప్రచురించడంపై ఫ్రెంచ్ రాయబారిని బహిష్కరించాలని కోరుతూ పాకిస్థాన్ లోని చాలా నగరాల్లో ఇస్లానిక్ రాజకీయ పార్టీకి మద్దతుగా ఉన్న పోలీసులతో ప్రజలు ఘర్షణ పడుతున్నారు.

  • KVD Varma
  • Publish Date - 6:45 pm, Wed, 14 April 21
Pakistan: పాకిస్థాన్ లో చెలరేగిన హింస..భారత సిక్కు యాత్రీకుల పర్యటనకు ఇబ్బందులు
Pakistan

Pakistan: పాకిస్థాన్ లోని పలు నగరాల్లో భారీ హింస చెలరేగింది. ఫ్రాన్స్ లో  దైవదూషణపై వ్యంగ్య చిత్రాలను ప్రచురించడంపై ఫ్రెంచ్ రాయబారిని బహిష్కరించాలని కోరుతూ పాకిస్థాన్ లోని చాలా నగరాల్లో ఇస్లానిక్ రాజకీయ పార్టీకి మద్దతుగా ఉన్న పోలీసులతో ప్రజలు ఘర్షణ పడుతున్నారు. దీంతో అక్కడ పరిస్థితి అదుపు తప్పింది. ఈ ఘర్షణల్లో తెహ్రీక్-ఎ-లాబ్‌బాయిక్ పాకిస్తాన్ (టిఎల్‌పి) దాడుల్లో ఒక పోలీసు మృతి చెందారు. అయితే, పోలీసులు 12 మంది తమ కార్యకర్తలను కాల్చి చంపారని టిఎల్‌పి ఆరోపిస్తోంది. దీంతో పంజాబ్ లోని చాలా నగరాలకు శాంతిభద్రతలను నియంత్రించడం కోసం పారామిలటరీ దళాలను రంగంలోకి దించింది పాకిస్థాన్ ప్రభుత్వం. కాగా, టిఎల్‌పి కార్యకర్తలు రోడ్డు దిగ్బంధనం చేయడంతో బాధపడుతున్న వారిలో 800 మంది భారతీయ సిక్కులు కూడా ఉన్నారు.

“రావల్పిండిలోని గురుద్వారా పంజా సాహిబ్ హసనాబ్దాల్ లో వైశాఖి ఉత్సవంలో పాల్గొనడానికి సోమవారం ఇక్కడకు వచ్చిన భారతీయ సిక్కులు ఈ నిరసనల కారణంగా అక్కడికి చేరుకోలేకపోయారు.మంగళవారం మధ్యాహ్నం భారతీయ సిక్కులు 25 బస్సులలో గురుద్వారా పంజా సాహిబ్ హసనాబ్దాల్ కు బయలుదేరారు, ఈ బస్సులను పోలీసులు మరియు రేంజర్స్ ఎస్కార్ట్ చేశారు”. అని పంజాబ్ ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. అయితే, అక్కడకు పాత్రికేయులు చేరుకునే సమయానికి సిక్కు యాత్రికులు హాసనాబ్ డాల్ కు చేరుకోలేదు. దీంతో బుధవారం జరగనున్న ప్రధాన కార్యక్రమానికి వారెందుకు రాలేదని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు కచ్చితంగా ఈరోజు సిక్కు యాత్రికులు ఇక్కడకు చేరుకుంటారని మేము ఆశిస్తున్నాం అంటూ ఆ అధికారి జవాబిచ్చారు.

భారతదేశానికి చెందిన సిక్కులు పాకిస్థాన్ లో పది రోజుల యాత్రలో భాగంగా పంజాబ్ లోని ఇతర పవిత్ర స్థలాలను కూడా సందర్శించాల్సి ఉంది. ఈ ఏప్రిల్ 15 నుంచి తమ యాత్రను ప్రారంభించాలి. కానీ, ఈ నిరసనలు ఇలాగే కొనసాగితే, సిక్కు యాత్రీకులు తమ యాత్రను కొనసాగించడం కష్టం అని అధికారులు చెబుతున్నారు. వారు గురుద్వారా పంజాలోనే ఉండాల్సి ఉంటుందని చెబుతున్నారు.

Also Read: World-record rabbit: ప్రపంచంలోని అతిపెద్ద కుందేలు మిస్సింగ్.. ఆచూకి తెలిపిన వారికి భారీగా పారితోషకం

Vaccination: టీకాలు వేయడంలో ఇజ్రాయిల్ సూపర్ స్పీడ్..కరోనాకు కళ్లెం వేసే దిశలో వేగంగా అడుగులు..